Maharashtra Tiger: ఆపరేషన్ సక్సెస్.. 13 మందిని చంపిన పులిని బంధించిన అధికారులు..

|

Oct 13, 2022 | 4:55 PM

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 13 మంది ప్రాణాలు తీసిన పులిని అదుపులోకి తీసుకున్నారు. మ్యాన్ ఈటర్‌ CT 1 టైగర్‌ ఎట్టకేలకు అధికారుల వలకు చిక్కింది.

Maharashtra Tiger: ఆపరేషన్ సక్సెస్.. 13 మందిని చంపిన పులిని బంధించిన అధికారులు..
Tiger
Follow us on

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 13 మంది ప్రాణాలు తీసిన పులిని అదుపులోకి తీసుకున్నారు. మ్యాన్ ఈటర్‌ CT 1 టైగర్‌ ఎట్టకేలకు అధికారుల వలకు చిక్కింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ అడవుల్లో తిరుగుతున్న CT1 పులి.. మనిషి రక్తాన్ని రుచిమరిగింది. కనిపించిన వాళ్లను కనిపించినట్టే వేటాడుతూ.. స్థానికులకు వెన్నులో వణుకుపుట్టించింది. గ్రామం దాటి పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడేలా చేసింది. చంద్రాపూర్ జిల్లాలోని వాడ్సాలో ఆరుగురిని, భండారాలో నలుగురిని, బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ముగ్గురిని పులి చంపింది. దీంతో ఈ పులిని ఎలాగైనా బంధించాలని.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ నాగ్‌పూర్ శాఖ అక్టోబర్ 4న నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.

Tiger

సుమారు 9 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన అటవీసిబ్బంది.. ఎట్టకేలకు పులిని బోనులో బంధించింది. 183 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్‌పూర్‌లోని గోరెవాడ రెస్క్యూ సెంటర్‌కు.. ఈ మ్యాన్ ఈటర్‌ను తరలించారు. తడోబా టైగర్ రెస్క్యూ టీమ్‌తో పాటు, చంద్రాపూర్, నవేగావ్, నాగ్జిరాకు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు పులి ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

ఇటీవల బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ పరిసర ప్రాంతాల్లో టైగర్‌ హడలెత్తించింది. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగహాలో ఉన్న వాల్మీకి టైగర్ రిజర్వ్‌లోని ఓ పులి ఏకంగా 9మందిని చంపి తిన్నది.. దీంతో మనిషి నెత్తురు రుచి మరిగిన పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నించగా.. ఫలించలేదు. చివరకు దానిని వేటాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..