Incredible India :ఇది ఫారెన్‌ టూరిస్ట్‌ స్పాట్‌ కాదు..మన దేశంలోనే ఉంది..ఎక్కడో తెలుసా..?

|

May 23, 2022 | 12:40 PM

ఇదో అందమైన లోకం..అందులో ఎన్నో రంగులు కలగలిగినది ఈ అనంత విశ్వం...వాటిల్లోకెల్లా అతి సుందరమైనది మన భారతదేశం..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర పట్టణాలు, అద్భుత కట్టడాలకు మన దేశం నెలవు..

Incredible India :ఇది ఫారెన్‌ టూరిస్ట్‌ స్పాట్‌ కాదు..మన దేశంలోనే ఉంది..ఎక్కడో తెలుసా..?
Incredible India
Follow us on

ఇదో అందమైన లోకం..అందులో ఎన్నో రంగులు కలగలిగినది ఈ అనంత విశ్వం…వాటిల్లోకెల్లా అతి సుందరమైనది మన భారతదేశం..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర పట్టణాలు, అద్భుత కట్టడాలకు మన దేశం నెలవు..అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిత్రం..ఇదేదో ఫారెన్‌ టూరిస్ట్‌ స్పాట్‌ అనుకుంటే మీరు పొరపడినట్టే..ఎందుకంటే..ఇది నిజంగా మన దేశంలోనిదే..ఆకాశం పూర్తిగా నీలిరంగు ఆవహించిన సమయంలో ఓ ప్రకృతి ప్రేమికుడు తీసిన చిత్రం ఇది..ఇప్పుడు నెట్టింట్లో చేరి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

నార్వేజియన్ మాజీ దౌత్యవేత్త ఎరిక్ సోల్ హీమ్ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఈ అందమైన ఫోటోని షేర్‌ చేశారు. సోల్‌ హీమ్‌ అక్కడి ప్రకృతి అందానికి మంత్రముగ్దులైనట్లు చెప్పారు. ఈ సిమ్లా చిత్రాన్ని ట్వీట్ చేస్తూ, “ఇది యూరప్ కాదు, క్లీన్ అండ్ గ్రీన్ సిమ్లా” అనే ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంత బ్యూటీఫుల్‌ ఫోటోని షేర్‌ చేసిన నార్వేజియన్‌ దౌత్యవేత్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.

67ఏళ్ల ఎరిక్ సోల్‌హీమ్ నార్వేజియన్ మాజీ దౌత్యవేత్త, రాజకీయ నేత కూడాను… అతను 2005 నుండి 2012 వరకు నార్వే ప్రభుత్వంలో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా, పర్యావరణ మంత్రిగా పనిచేశారు. 2016 నుండి 2018 వరకు ఐక్యరాజ్యసమితి అండర్-సెక్రటరీ-జనరల్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే అతను కర్ణాటకలోని ఉడిపిలోని బీచ్‌సైడ్ రోడ్ అందమైన చిత్రాన్ని కూడా పంచుకున్నాడు, దీన్ని ‘ప్రపంచంలోని అత్యంత అందమైన సైక్లింగ్ మార్గం’ అంటూ అప్పట్లో ట్విట్‌ చేశారు.