
LPG, CNG పేర్లు వినే ఉంటారు. ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేరుతో వీటిని పిలుస్తూ ఉంటారు. ఇక CNG కార్లు, ఆటోల గురించి మన వింటే ఉంటాం. సీఎన్‌జీ వెహికల్స్ వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. దీంతో సీఎన్‌జీ వెహికల్స్ వాడాలని ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహిస్తున్నాయి. ఎల్పీజీ, సీఎన్‌జీకి తేడా ఏంటి..? ఈ రెండు ఒక్కటేనా..? అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? అనే విషయాలు ఇందులో చూద్దాం.
LPG, CNG పేర్లు ఒకేలా ఉన్నప్పటికీ ఈ రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఈ రెండూ అసలు భిన్నమైనవి. సీఎన్‌జీ అనేది మిథేన్ వాయువు అయితే.. ఎల్పీజీ అనేది ప్రొపేన్, బ్యూటేన్ల మిశ్రమం. ఈ రెండు ప్రెషరైజ్డ్ సిలిండర్లలో నిల్వ చేస్తారు. అయతే సీఎన్‌జీ అనేది వాయు రూపంలో ఉంటే.. ఎల్పీజీ అనేది ద్రవ రూపంలో ఉంటుంది. సీఎన్‌జీ అనేది గాలి కంటే చాలా తేలికగా ఉంటుంది. దీనిని మండించినప్పుడు ఎలాంటి అవేశేషాలను కూడా ఉత్పత్తి చేయదు. అయితే లీక్ అయినప్పుడు ఇది త్వరగా వ్యాపిస్తుంది.
ఇక ఎల్పీజీ విషయానికొస్తే.. ఇది మండినప్పుడు ఎక్కువ అవశేషాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలి కంటే ఎక్కువ బరువుగా ఉండటంతో పాాటు లీక్ అయినప్పుడు దిగువున పేరుకుపోతుంది. దీని వల్ల లీకయ్యే సమయంలో అగ్ని ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక ఎల్పీజీ అనేది గ్యాస్ ప్రాసెసింగ్, పెట్రోలియం శుద్ది చేసే సమయంలో ఉత్పత్తి అవుతుంది. సీఎన్‌జీ అనేది సహజ వాయువు. ఇది చమురు బావుల నుంచి వస్తుంది. సీఎన్‌జీ పూర్తి పేరు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఇక ఎల్పీజీ పూర్తి పేరు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సీఎన్‌జీనీ బస్సుల, ఆటోలు, టాక్సీలకు ఇందనంగా ఉపయోగిస్తే.. ఎల్పీజీని వంటకు ఉపయోగిస్తారు.