Viral Video: నిమ్మ సోడా చేయడంలో లేరు ఇతనికి సాటి.. పాట పాడుతూ గోలీ కొడుతూ..
స్ట్రీట్ ఫుడ్‌కు ఇండియా ఫేమస్. స్టార్ హోటళ్లలోనూ దొరకని రుచి తోపుడు బండ్లు, రోడ్డు పక్కన షాపుల్లో దొరుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏ రాష్ట్రానికి వెళ్లినా రోడ్‌సైడ్ బండిపై మనకిష్టమైన ఆహారపానీయాలు...
స్ట్రీట్ ఫుడ్‌కు ఇండియా ఫేమస్. స్టార్ హోటళ్లలోనూ దొరకని రుచి తోపుడు బండ్లు, రోడ్డు పక్కన షాపుల్లో దొరుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏ రాష్ట్రానికి వెళ్లినా రోడ్‌సైడ్ బండిపై మనకిష్టమైన ఆహారపానీయాలు నోరూరిస్తాయి. అయితే వాటిని రుచి చేయడం ఒకెత్తైతే.. విక్రయించడం మరో ఎత్తు. కొనుగోలు దారులను ఆకట్టుకునేలా చేస్తే వ్యాపారంలో లాభాలు సాధించవచ్చు. ఇలా కస్టమర్లను ఆకర్షించడంలో కొందరు వ్యాపారులు తమదైన స్టయిల్ కనబరుస్తుంటారు. అలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా, పంజాబ్‌లో నిమ్మసోడా అమ్ముకునే ఓ వ్యక్తి చేష్టలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పంజాబ్‌లోని కిరాట్‌పూర్ సాహిబ్‌లో గోలీసోడా అమ్ముకునే వ్యక్తి వెరైటీగా నిమ్మసోడా తయారుచేస్తున్నాడు.
నిమ్మకాయలను పిండే దగ్గర నుంచి గోలీసోడా కొట్టి కలిపే వరకూ పాటపాడుతూ ఆకట్టుకుంటున్నాడు. దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టగా అది కాస్తా వైరల్‌గా మారింది. కచ్చాబాదాం కొడుకు అంటూ ఒకరు కామెంట్ చేయగా, అరిచి..అరిచి అలసిపోయాడు.. అతడికి ముందు నిమ్మసోడా తాగించండని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.
View this post on Instagram
Also Read
Pak-Chian: ఖాన్ కంటే మెరుగ్గా షాబాజ్ పాలన ఉంటుంది.. పాకిస్తాన్‌పై కన్నేసిన డ్రాగన్ కంట్రీ..
UGC NET 2022: విద్యార్థులకి గమనిక.. జూన్‌లో UGC NET 2022 పరీక్ష
Hyderabad: హైదరాబాద్ లో బైక్ రేసింగ్ కల్చర్.. ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్.. అంతే కాకుండా