Corona tests: కరోనా పరీక్షల కోసం కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసిన ఐసీఎంఆర్.. ల్యాబ్ ల పై ఒత్తిడి తగ్గించడానికే..

ICMR on Corona Tests: కరోనా రెండో వేవ్ విరుచుకు పడుతున్న సమయంలో కరోనా పరీక్షలు కూడా ఇబ్బందికరంగా మారాయి. ఒక్కసారిగా టెస్టుల కోసం ప్రజలు వస్తుండటంతో ల్యాబ్ ల పై ఒత్తిడి పెరిగింది.

Corona tests: కరోనా పరీక్షల కోసం కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసిన ఐసీఎంఆర్.. ల్యాబ్ ల పై ఒత్తిడి తగ్గించడానికే..
ICMR study

Updated on: May 05, 2021 | 9:22 AM

Corona tests: కరోనా రెండో వేవ్ విరుచుకు పడుతున్న సమయంలో కరోనా పరీక్షలు కూడా ఇబ్బందికరంగా మారాయి. ఒక్కసారిగా టెస్టుల కోసం ప్రజలు వస్తుండటంతో ల్యాబ్ ల పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపధ్యంలో శాంపిల్ కలెక్షన్.. పరీక్షలు.. ఫలితాలు ఇవ్వడం అన్నీ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. కొంతమంది భయంతో పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. ఒకసారి నెగెటివ్ వచ్చిన తరువాత కూడా ఏమో ఇది తప్పేమో అనే ఆలోచనతో మరో దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడమూ కనిపిస్తోంది. దీంతో ల్యాబ్ ల ముందు క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ప్రయాణాలకు పరీక్షలు తప్పనిసరి కావడమూ ఇబ్బందికరంగా మారింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా తాము ప్రయాణించడం కోసం టెస్ట్ లు చేయించుకోవాలని వస్తున్నారు. దీంతో మరింత ఎక్కువ మంది ల్యాబ్ ల ముందు చేరుతున్నారు. ఈ పరిస్థితులు నివారించడానికి, ల్యాబ్ ల మీద ఒత్తిడి తగ్గించడానికి ఐసీఎంఆర్ కొన్ని కీలక సూచనలు చేసింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కోవిడ్ -19 పరీక్ష కోసం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. టెస్టింగ్ లేబ్ లలో పెరుగుతున్న ఒత్తిడి.. కారణంగా పరీక్షలను వేగంగా చేయడానికి అలాగే వేగంగా ఫలితాలను ఇవ్వడానికి గానూ ఈ మార్గాదర్శకాలు ఇచ్చింది. “RAT లేదా RT-PCR ద్వారా ఒకసారి పాజిటివ్ పరీక్షించిన ఏ వ్యక్తిలోనైనా RT-PCR పరీక్ష పునరావృతం కాకూడదు” అని ఐసీఎంఆర్ ఆదేశించింది. కోవిడ్ -19 కోలుకున్న రోగులకు ఆసుపత్రి డిశ్చార్జ్ సమయంలో ఎటువంటి పరీక్ష అవసరం లేదని చెప్పింది. అంతేకాకుండా, అంతర్-రాష్ట్ర దేశీయ ప్రయాణాన్ని చేపట్టే ఆరోగ్య వ్యక్తుల కోసం తప్పనిసరి నెగెటివ్ RT-PCR పరీక్ష నివేదికల నిబంధనను తొలగించాలని ICMR యోచిస్తోంది. అధికారిక నోటిఫికేషన్‌లో, ICMR ఇలా చెప్పింది..”ప్రయోగశాలలపై భారాన్ని తగ్గించడానికి అంతర్-రాష్ట్ర దేశీయ ప్రయాణాన్ని చేపట్టే ఆరోగ్యకరమైన వ్యక్తులలో RT-PCR పరీక్ష అవసరం పూర్తిగా తొలగించాలి”.

ఇదిలా ఉండగా..భారతదేశంలో మంగళవారం 357,229 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 20 మిలియన్ల మంది ఇప్పటివరకూ కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా మొత్తం మరణాల సంఖ్య 222,408 కు చేరుకుంది. ఇటీవలి వారాల్లో, శ్మశానవాటికలకు వెలుపల క్యూ లైన్లు.. అంబులెన్స్ లను వెనక్కి పంపించడం వంటి దృశ్యాలు సర్వ సాధారణం అయిపోయాయి. ఇది దేశంలోని ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితిని సూచిస్తోంది.

Also Read: Corona Effect: ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక ఉత్తర్వులు.. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి..

CORONA SECOND-WAVE: దేశంలో కరోనా విలయ తాండవం.. లోకల్ లాక్‌డౌన్లతో కట్టడికి ప్రభుత్వాల యత్నం