Wedding: ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తానంటోన్న పెళ్లి కొడుకు.. వధువు ఇంటికి ఎలా వచ్చాడో చూస్తే షాకే..

|

Feb 04, 2023 | 9:28 AM

పెళ్లి కొడుకు ఇంటి దగ్గర బయలు దేరిననుంచి.. పెళ్లి అనంతరం మళ్లీ వధువును తీసుకుని ఇంటికి వచ్చే వరకు.. కుటుంబ సభ్యుల హాడావుడి.. బరాత్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Wedding: ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తానంటోన్న పెళ్లి కొడుకు.. వధువు ఇంటికి ఎలా వచ్చాడో చూస్తే షాకే..
Wedding
Follow us on

వివాహ వేడుక అంటేనే సందడే.. సందడి.. పెళ్లి కొడుకు ఇంటి దగ్గర బయలు దేరిననుంచి.. పెళ్లి అనంతరం మళ్లీ వధువును తీసుకుని ఇంటికి వచ్చే వరకు.. కుటుంబ సభ్యుల హాడావుడి.. బరాత్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా వరుడు కారులోనే.. లేదా గుర్రంపైనో వధువు ఇంటికి వెళతాడు. అయితే, గుజరాత్‌లోని నవ్‌సారిలో ఓ వింత ఊరేగింపు వార్త వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లి ఊరేగింపులో పెళ్లికొడుకు పెళ్లికూతురు ఇంటికి చేరింది కారుపైన కాదు, జేసీబీ పైన.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వరుడు స్వయంగా దగ్గరుండి చూసుకున్నాడు. తన పెళ్లిలో ఏదైనా డిఫరెంట్‌గా వైరైటీ ఉండాలనుకున్నాడు. అందుకే తన ఊరేగింపులో జేసీబీలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి సమయంలో జరిగిన ఈ ఊరేగింపు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలు, ఫొటోలపై బోలెడన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఊరేగింపునకు సంబంధించిన కొన్ని చిత్రాలను వార్తా సంస్థ ANI సైతం విడుదల చేసింది.

గుజరాత్‌లోని నవ్‌సారి కలియారి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గిరిజన ధోడియా కమ్యూనిటీకి చెందిన కేయూర్ పటేల్ పెళ్లి సందర్భంగా బుల్‌డోజర్‌పై వధువు ఇంటికి చేరుకున్నాడు. ముందుగా పటేల్ తన వివాహంలో ఏదైనా భిన్నంగా.. వైరైటీగా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన వివాహాన్ని ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా ఏదైనా చేయాలనుకున్నాడు. ఇందుకోసం యూట్యూబ్‌లో చాలా పరిశోధనలు చేశాడు. ఇంతలో జేసీబీపై ఎవరో శుభకార్యానికి వెళుతున్న వీడియో చూశాడు.

ఇవి కూడా చదవండి

అతనికి ఈ వీడియో నచ్చడంతో పెళ్లి కోసం జేసీబీ బుక్ చేశాడు. మరోవైపు కళ్యాణోత్సవం జరిగే రోజు తన బంధువులు వాహనాలన్నీ బుక్ చేసుకున్నారని, అయితే తాను మాత్రం జేసీబీలోనే వెళ్తానని వరుడు స్పష్టం చేసినట్లు తెలిపాడు.

వీడియో చూడండి..

కాగా.. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.