
PM Kisan 22th installment: పీఎం కిసాన్ లబ్దిదారులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇటీవల వీరికి 21వ విడత నిధులను కేంద్రం ప్రభుత్వం అకౌంట్లో జమ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ అందుకునే రైతులకు మరో శుభవార్త అందింది. త్వరలోనే పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు కేంద్రం సిద్దమవుతోంది. దీంతో రైతులు మరో రూ.2 వేలు అందుకోనున్నారు.
ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 22వ విడత డబ్బులను కేంద్రం రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. అయితే ఈ డబ్బులు రైతులు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కేవైసీ పెండింగ్‌లో ఉండే మీకు అకౌంట్లో నగదు జమ కావు. బ్యాంక్ కేవైసీ, పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి కేవైసీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం వల్ల మీరు నగదు అందుకోవడంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోరు.
ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి. బ్యాంక్ కేవైసీ అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. భూమి ధృవీకరణ పూర్తి చేయలి.ఇక మొబైల్ నెంబర్ యాక్టివ్‌గా ఉండాలి. ఇలాంటివి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు సులువుగా నగదు పొందుతారు.
మీ సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు. లేదా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేసి చేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా చేసుకునే అవకాశముంది. పీఎం కిసాన్ పథకం తరపున 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు కేంద్రం ఏడాదికి రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఏడాదిలో మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున అందిస్తోంది.