PM Modi: ఎప్పటికీ మరిచిపోలేను.. థ్యాంకూ చెన్నై.. ప్రధాని మోదీ రోడ్‌షోకి పోటెత్తిన జనం..

|

Apr 10, 2024 | 7:07 AM

ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారంలో స్పీడును పెంచింది.. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో వరుస పర్యటనలో హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ మంగళవారం తమిళనాడులో పర్యటించారు. తమిళిసై, అన్నామలైతో కలిసి చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్డు షో నిర్వహించారు.

PM Modi: ఎప్పటికీ మరిచిపోలేను.. థ్యాంకూ చెన్నై.. ప్రధాని మోదీ రోడ్‌షోకి పోటెత్తిన జనం..
Pm Modi
Follow us on

ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారంలో స్పీడును పెంచింది.. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో వరుస పర్యటనలో హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ మంగళవారం తమిళనాడులో పర్యటించారు. తమిళిసై, అన్నామలైతో కలిసి చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్డు షో నిర్వహించారు. మోదీ రోడ్‌షోకి జనం పోటెత్తారు.. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన నాణ్యతను, జీవన సౌలభ్యాన్ని పెంచాయని అన్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

చెన్నై నగరాన్ని డైనమిక్ అండ్ వైబ్రెంట్.. సిటీగా పేర్కొన్న మోదీ.. చెన్నైకి తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. నిన్న జరిగిన రోడ్ షో తనకు మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్ని స్థానాలను NDA కూటమి గెలుపొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ.. రోడ్ షో ఫొటోలను, వీడియోలను షేర్ చేసి.. థ్యాంకూ చెన్నై.. నేటి రోడ్‌షో నా జ్ఞాపకంలో ఎప్పటికీ నిలిచిపోతుంది.. అంటూ రాశారు..

వీడియో చూడండి..

“ఈ డైనమిక్ సిటీలో నేటి రోడ్‌షో నా జ్ఞాపకంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రజల ఆశీర్వాదం.. మీ సేవలో నిరంతరం కష్టపడి మన దేశం మరింత అభివృద్ధి చెందడానికి నాకు శక్తిని ఇస్తుంది. చెన్నైలోని ఉత్సాహం కూడా తమిళనాడు ఎన్‌డిఎకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చూపిస్తుంది” అని మోడీ ర్యాలీ దృశ్యాలతో పాటు సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.

కాగా.. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..