Tesla: ముంబై-పూణె హైవేపై టెస్లా కారు చక్కర్లు.. ఇండియాలో లాంచింగ్ ఎప్పుడో తెలుసా!
ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కారు భారత్ రోడ్లపై చక్కర్లు కొట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యే ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే మీద టెస్లా మోడల్ Y టెస్టింగ్ మ్యూల్ కనిపించింది. దీంతో త్వరలోనే ఈ టెస్లా కార్లు భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

టెస్లా కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ టెస్లా కార్ల రాక కోసం ఇండియన్స్ చాలా రోజులుగా ఎదురుస్తున్నారు. అయితే భారత్ మార్కెట్‌లోకి త్వరలోనే టెస్లా కార్లు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై టెస్లా మోడల్ Y టెస్టింగ్ మ్యూల్ కనిపించింది. ఈ టెస్ట్ సక్సెస్ ఫుల్‌గా పూర్తయితే భారత్‌లో టెస్లా కార్లు విడుదల చేసేందుకు మస్క్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కానీ నిజమైతే త్వరలోనే భారత్ రోడ్లపై టెస్లా కార్లు చక్కర్లు కొట్టడం మనం చూడవచ్చు.
జునిపర్ (Juniper) అనే కోడ్‌తో తయారు చేయబడిన టెస్లా మోడల్ Y ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై చక్కర్లు కొడుతూ కనిపించింది. రోడ్లపై ఈ కారును చూసిన వాహనదారులు తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. ప్రస్తుతం టెస్లా మోడల్ Y ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అమెరికా, కెనడాలో అందుబాటులో ఉంది. ఫేస్‌లిఫ్ట్ సహా మరికొన్ని అప్‌డేట్స్‌తో ఇది భారత్‌లోకి రానున్నట్టు తెలుస్తోంది.
టెస్లా కారు ప్రత్యేకతలేంటి..
జనిపర్ అనే కోడ్‌నేమ్‌తో రూపొందించబడిన టెస్లా మోడల్ Y ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారు C-ఆకారపు LED టెయిల్‌లైట్‌లు కలిగి ఉంటుంది. ఈ టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ కారు 526 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ బ్యాటరీతో రాబోతోంది. దీంతో ఈ కార్లో మనం దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఈ కారు 4.6 సెక్లన్లలో 0-96 KMPH వేగాన్ని అందుకోగలదని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ 200 కిలోమీటర్లని కంపెనీ ప్రకటించింది. ఈ కారులో పొడవైన వంపు తిరిగిన రూఫ్ లైన్, ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. కారులోపల 15.4 అంగుళాల టచ్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. వెనుక సీట్‌లో కూర్చున్న ప్రయాణీకుల కోసం మరో 8 అంగుళాల స్క్రీన్‌ను కూడా అమర్చారు. వెంటిలేటెడ్ సీట్లు, ADAS ఫీచర్, వైర్‌లెస్ ఛార్జింగ్ సహా అనేక అత్యాధునిక ఫీచర్లను ఈ కార్లో ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ టెస్లా కారు ఆరు కలర్ ఆప్షన్స్‌తో భారత్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కారును భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఇప్పటికే టెస్ట్ రైడ్ పూర్తి చేశారు కాబట్టి త్వరలోనే ఇండియాలో టెస్లాను లాంఛ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ పోస్ట్ చూడండి…
Tesla spotted testing on the Mumbai-Pune Expressway!
Could this be an early move to bring $TSLA FSD to India? 😮
— Herbert Ong (@herbertong) April 15, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
