Terrorists Attack: జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ప్రతిరోజు వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతూ హతమారుస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం బుద్గాం జిల్లా (Budgam district) చదూరా తహసీల్ కార్యాలయం సమీపంలో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగి రాహుల్ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే ఆయనన్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు నిరంతర గాలింపు చర్యలు చేపడుతున్నారు. వివిధ చోట్ల నిరంతరంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి ఉగ్రవాదులను ఏరివేస్తున్నారు. ఈ కారణంగానే ఉగ్రవాదులు రెచ్చిపోయి ఇలా కార్యాలయాలపై కాల్పులకు తెగబడుతున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో 168 మంది ఉగ్రవాదులు:
జమ్మూ కాశ్మీర్‌లో కనీసం 168 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉండగా, ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో 75 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. హతమైన ఉగ్రవాదుల్లో 21 మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. గత 11 నెలల్లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి జరిగిన ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదులను మట్టుబెట్టామని, 12 చొరబాటు ప్రయత్నాలను భగ్నం చేశామని చెప్పారు. 2021 సంవత్సరంలో 180 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని, వారిలో 18 మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌తో సమన్వయం చేసుకోవడం, సామాన్యుల మద్దతు వల్ల ఇది సాధ్యమైందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గత ఏడాది 495 మంది గ్రౌండ్ వర్కర్లు (ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్న వారు) పట్టుబడ్డారని, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో కేవలం 87 మంది మాత్రమే పట్టుబడ్డారని తెలిపారు.
కాగా, మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక పౌరుడు మరణించగా, ఒక సైనికుడితో సహా మరో ఇద్దరు గాయపడ్డారు. బందిపొరలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతని వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఇది కాకుండా అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అదే సమయంలో శ్రీనగర్‌లోని బెమీనాలో నలుగురు లష్కర్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి 4 పిస్టల్స్ సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ప్రతి రోజు ఉగ్రకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
J&K | Terrorists fired bullets at an employee, Rahul Bhat at Tehsildar office, Chadoora in Budgam district. He has been shifted to the hospital.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/DweEzDXc1n
— ANI (@ANI) May 12, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి