Terrorist Attack: శ్రీనగర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీసుల బస్సుపై దాడి..!

|

Dec 13, 2021 | 7:11 PM

Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో కాల్పులకు తెగబడుతున్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రతి..

Terrorist Attack: శ్రీనగర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీసుల బస్సుపై దాడి..!
Follow us on

Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో కాల్పులకు తెగబడుతున్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రతి నిత్యం భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్‌లోని పంథా చౌక్‌ ప్రాంతంలోని జెవాన్‌ సమీపంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెళ్తున్న బస్సుపై ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 14 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.