ఢిల్లీలో టెన్షన్ వాతావరణం.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం..

|

Feb 13, 2024 | 12:40 PM

ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పంజాబ్, హర్యానా సరిహద్దు శింభూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఢిల్లీలో టెన్షన్ వాతావరణం.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం..
Delhi Farmers
Follow us on

ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పంజాబ్, హర్యానా సరిహద్దు శింభూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రహదారి పొడవునా పోలీసులను మొహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పంటల కోసం కనీస మద్దతు ధర చట్టం రూపొందించడం, 2020లో చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులు కొట్టివేతకు సంబంధించి రైతులు నిరసన చేపట్టారు. భారీ ఎత్తున ట్రాక్టర్లలో ర్యాలీ చేపట్టారు. మంగళవారం ఉదయం 10 గంటలకు వందల ట్రాక్టర్లతో రైతులు ఢిల్లీకి బయలుదేరారు.

ఈ ర్యాలీకి కిసాన్ మజ్దూర్ సంఘర్ష్‌ కమిటీ మద్దతు పలికింది. చర్చలతో తమ డిమాండ్లను పరిష్కరిచుకోవాలని భావిస్తున్నట్లు ఆ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే రైతుల ఆందోళనను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు. జాతీయ రహదారులపై రెండు, మూడు అంచెల బారికేడ్లు ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుద ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పలు మెట్రో సేవలను నిలిపి వేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..