
స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. అయితే గుడిలోకి వెళ్లాలంటే కూడా డ్రెస్ కోడ్ ఉండటాన్ని ఎప్పుడైన విన్నారా ?. అదేంటి గుడిలోకి వెళ్లాలంటే కూడా డ్రెస్ కోడ్ ఉండాలా అని ఆలోచిస్తున్నారా. మీరు అనుకుంటుంది నిజమే. మహారాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లేవారికి డ్రెస్ కోడ్ అమలు చేసేలా ‘మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్’ అనే సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికే మహారాష్ట్రంలో 130కి పైగా ఆలయాలు ఈ వస్త్ర నిబంధనను పాటిస్తున్నాయి. అలాగే ఈ పుణ్యక్షేత్రాలకు 500 మీటర్ల లోపల మద్యం, మాంసం అమ్మడాన్ని కూడా నిషేధించాలని మహాసంఘ్ కోరుతోంది.
అయితే ఆ నిర్ణయం తీసుకోవడంపై మహాసంఘ్‌లో ఉండే ధర్మకర్తలు, పూజారులు, న్యాయవాదులు, కార్యకర్తలు స్పందించారు. కొంతమంది దైవదర్శనం కోసం పుణ్యక్షేత్రాలకు వచ్చి సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం సరైన వస్త్రధారణ లేకుండా వీడియోలు చేస్తున్నారని తెలిపారు. ఏ ప్రార్థన స్థలమైనప్పటికీ దాని పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకోసమే గుడిలోకి వచ్చినప్పుడు కొన్ని రకాల వస్త్రాలు ధరించకూడదని నిర్ణయించామని తెలిపారు. ఈ నిబంధన ప్రకారం షార్ట్ ఫిట్టింగ్, బిగుతుగా ఉన్నవి,చిరిగిపోయినవి, రిలీవింగ్ వస్త్రాలు ధరించకూడదని పేర్కొన్నారు. అయితే ప్యాంటు, చొక్కాలు వేసుకుంటే వాటిపై అభ్యంతరం లేదని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఇంకా ఎక్కువ ఆలయాలకు ఈ నిబంధన అమలు చేస్తామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..