Shot Dead: రాజస్థాన్ దారుణ ఘటన వెలుగు చూసింది. యువతి తనను ప్రేమించడం లేదనే కారణంతో రెచ్చిపోయిన యువకుడు ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన భరత్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. భరత్‌పూర్ జిల్లా పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖర్జీనగర్ ప్రాంతానికి చెందిన యువకుడు సునీల్.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతి అతన్ని ప్రేమించడం లేదు.
దాంతో ఆమెపై ఆగ్రహం పెంచుకున్న సునీల్.. మంగళవారం నాడు బాధిత యువతి తన ఇంటిపై ఉన్న చెట్లకు నీరు పోస్తుండగా తుపాకీతో కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో యువతి స్పాట్‌లోనే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన సునీల్ కోసం గాలింపు చేపట్టారు.
Also read:
నా కుమారుడికి పరమ్ వీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించాల్సింది, కల్నల్ సంతోష్ బాబు తండ్రి
కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే