Unpaid Loan: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా.. అప్పుతీర్చలేదని.. ఇద్దరి అబ్బాయిల బట్టలు విప్పించి..

మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ముగ్గురు వ్యక్తులు ఇద్దరు టీనేజర్ స్నేహితులను, ఒక మైనర్‌ను ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేశారు. వారిని బెదిరించేందుకు దాన్ని ఈ తతంగాన్నంత వీడియో రికార్డ్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు.

Unpaid Loan: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా.. అప్పుతీర్చలేదని.. ఇద్దరి అబ్బాయిల బట్టలు విప్పించి..
Mumbai

Updated on: Jul 11, 2025 | 5:42 PM

తీసుకున్న అప్పు చెల్లించలేదని ముగ్గురు వ్యక్తులు ఇద్దరు టీనేజర్ స్నేహితులను, ఒక మైనర్‌ను ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేసిన ఘటన మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు టీనేజర్స్‌ ఒకరు 19 ఏళ్ల యువకుడు, మరొక మైనర్‌ ఇంట్లో తెలియకుండా కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారు. అయితే చాలా రోజులు అయిన ఆ టీనెజర్స్‌ ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన అప్పు ఇచ్చిన వ్యక్తి తన స్నేహితులతో కలిసి.. వాళ్లను కిడ్నాప్‌ చేసి పూణెలోని భూలేశ్వర్‌ ప్రాంతమైన కల్బాదేవి రోడ్‌లోని ఒక భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ వాళ్లను బంధించిన వారిపై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా వాళ్ల ఇద్దరితో బట్టలు విప్పించి ఓరల్‌ సెక్స్‌ చేయమని వారిపి బలవంతం చేశారు. వారిని బెదిరించేందుకు దాన్ని వీడియో తీసినట్టు పోలీసులు గుర్తించారు.

తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలని.. లేకపోతే ఇద్దరికి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తానని నిందితులు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. తీసుకున్న డబ్బు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే వారిని వెళ్ళడానికి అనుమతించారని, ఆ తర్వాత వారు ముంబైకి తిరిగి వచ్చారని పోలీసులు తెలిపారు.

మైనర్‌ బాలుడి ఒంటిపై గాయాలు గుర్తించిన బాధితుడి తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ ఇద్దరు టీనేజర్స్‌ తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని.. తిరిగి చెల్లించలేదని నిందితుడు ఆరోపించారు. కానీ టీనేజర్స్‌పై విచక్షణారహితంగా దాడి చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. అంతే కాకుండా అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఆ ఇద్దరి టీనేజర్స్‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.