Tandoori Chicken: సీఎంనే షేక్ చేసింది.. రాజకీయ దుమారం రేపుతోన్న తందూరి చికెన్.. ఇంతకీ వివాదం ఏమంటే..?

Himachal Pradesh: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికార బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. అదే తందూరి చికెన్.. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తందూరి చికెన్ వివాదం దుమారం రేపుతోంది. వివరాల్లోకెళితే..

Tandoori Chicken: సీఎంనే షేక్ చేసింది.. రాజకీయ దుమారం రేపుతోన్న తందూరి చికెన్.. ఇంతకీ వివాదం ఏమంటే..?
Tandoori Chicken

Updated on: Feb 01, 2024 | 11:01 AM

Himachal Pradesh: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికార బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. అదే తందూరి చికెన్.. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తందూరి చికెన్ వివాదం దుమారం రేపుతోంది. వివరాల్లోకెళితే.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ ఉనా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తందూరి చికెన్ వడ్డించారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై రాజకీయాలు వేడెక్కాయి. సీఎం పర్యటనలో తందూరి చికెన్ వడ్డించడంపై బీజేపీ.. కాంగ్రెస్‌ ను టార్గెట్ చేసింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చికెన్ పార్టీలతో సొమ్మును దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది.

ఈ విషయంపై ఉనాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సత్పాల్ సత్తి.. బుధవారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ కుబేరులు కోళ్లు తింటున్నారని కానీ.. బయట ప్రజలు, రోగుల శరీర భాగాలు ఛిద్రమవుతున్నాయని ఎమ్మెల్యే సత్తి దుయ్యబట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వం సొమ్మును దుర్వినియోగం చేస్తుందని.. కానీ సామాన్యులను పట్టించుకోవడం లేదని.. సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఖజానా ఖాళీ అవుతోందని ఆలోచిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సత్వరమే సానుకూల చర్యలు తీసుకోకుంటే, బీజేపీ పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపట్టవలసి ఉంటుందన్నారు.

Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంపై వైఫల్యం చెందిందని సత్తి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు భోగభాగ్యాలు కల్పించేందుకు ప్రభుత్వం బాహాటంగా ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తోందన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో అరాచక పరిస్థితి నెలకొందని, ఎలాంటి హోదా లేని వ్యక్తులు ప్రభుత్వ కాన్వాయ్‌లతో తిరుగుతున్నారని అన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం హిమ్‌కేర్ వంటి పథకానికి త్వరలో బడ్జెట్ విడుదల చేయకపోతే, బిజెపి పెద్ద ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఇటీవల సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఉనాలోని గాగ్రెట్‌లో ఐటీఐకి శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమంలో తందూరి చికెన్ వడ్డించగా, దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..