CM MK.Stalin: “సాంబార్ ఇడ్లీ కారంగా ఉంది”.. విద్యార్థి ఇంట్లో టిఫిన్ తిన్న ముఖ్యమంత్రి

|

Apr 16, 2022 | 7:38 AM

తమిళనాడు(Tamila Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK.Stalin) మరోసారి వార్తల్లో నిలిచారు. తన షెడ్యూల్‌ నుంచి కొంత సమయం విరామం తీసుకున్నారు. ఒక విద్యార్థి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకున్నారు. నరికురవర్‌ లోని పదో...

CM MK.Stalin: సాంబార్ ఇడ్లీ కారంగా ఉంది.. విద్యార్థి ఇంట్లో టిఫిన్ తిన్న ముఖ్యమంత్రి
Cm Stalin
Follow us on

తమిళనాడు(Tamila Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK.Stalin) మరోసారి వార్తల్లో నిలిచారు. తన షెడ్యూల్‌ నుంచి కొంత సమయం విరామం తీసుకున్నారు. ఒక విద్యార్థి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకున్నారు. నరికురవర్‌ లోని పదో తరగతి విద్యార్థిని ఇంటికి స్టాలిన్‌ వెళ్లారు. అక్కడ ఇడ్లీ, వడ తిన్నారు. సరికురవర్ వర్గాల వారు వెనుకబడ్డారని, వారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక మీడియా వీడియో వైరల్(Video Viral) అయింది. ఆ సమయంలో త్వరలోనే వారి ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని ముఖ్యమంత్రి స్టాలిన్ హామీ ఇచ్చారు. దీంతో కె.దివ్య అనే విద్యార్థిని ఇంటికి వెళ్లారు. వారితో సరదాగా మాట్లాడిన అనంతరం వారితో కూర్చుని టిఫిన్‌ చేశారు. సాంబార్‌ ఇడ్లీ తిన్న ఆయన ‘కారంగా ఉంది’ అన్నారు. వెంటనే అక్కడ ఉన్న అతను పిల్లలకు జలుబు, దగ్గు రాకుండా ఉండటం కోసం కారంగా చేసినట్లు తెలిపారు.

గతంలోనూ స్టాలిన్ సుగాలి విద్యార్థులకు వీడియో కాల్ చేసి వారితో మాట్లాడారు. మీ ఇంటికి వస్తే భోజనం పెడతారా అని రాష్ట్ర ముఖ్యమంత్రే అడగడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఆ విద్యార్థినులు మా ఇళ్ళకు వస్తారా అని ప్రశ్నించగా ‘తప్పకుండా మీ ఇళ్ళకు వస్తాను. వస్తే భోజనం పెడతారా?’ అని నవ్వుతూ స్టాలిన్‌ అడిగారు. వెంటనే విద్యార్థినులు తప్పకుండా రండి మీకు రుచికరమైన మాంసాహార భోజనమే పెడతామని బదులిచ్చారు. మరో ఘటనలో ఉదయం కాలినడకన వెళ్తున్న ముఖ్యమంత్రిని ఓ మహిళ గుర్తించి, తన మనసులో దాగున్న ప్రశ్నను అడిగేశారు. ‘మీరు ఇప్పటికీ యువకుడిలా కనిపించడానికి గల రహస్యం ఏంటో చెప్తారా..?’ అంటూ అడిగేసి, పెద్దగా నవ్వేశారు. దానికి స్టాలిన్ కూడా చిరునవ్వులు చిందించారు.

Also Read

ప్రాణం తీసిన ఈత సరదా.. రిజర్వాయర్ లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

Health Care: నోరు తెరిచి నిద్రించే అలవాటు ఉందా? దీని వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను తెలుసుకోండి..

IPl 2022: వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్.. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తాపై గెలుపు..