
సోషల్ మీడియాలో తన కుటుంబంపై పోస్టులు పెడుతున్న వారిపై ఎన్ని సార్లు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా సంస్థలు కనీసం పట్టించుకోవడం లేదంటూ స్వయంగా ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న ఎస్పి ఆరోపించాడు. తమిళనాడు తిరుచి ఎస్పీగా పనిచేస్తున్న వరుణ్ కుమార్ ఈ వాక్యాలు చేశాడు. తనతో పాటు తన భార్య సైతం డిపార్ట్‌మెంట్‌లోనే ఎస్పీగా పనిచేస్తుంది. ఆమె పైన సోషల్ మీడియాలో మార్ఫ్ చేసిన ఫోటోలు పెట్టి వేధిస్తున్న తాను ఏమీ చేయలేకపోతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఎస్పీ వరుణ్ కుమార్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన వ్యక్తులను సైతం పేరుతో సహా ప్రకటించారు. తమిళనాడుకు చెందిన ఎన్‌టీకే పార్టీకి సంబంధించిన వారు తనతో పాటు తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఎస్పీ వరుణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. గతంలో ఒక సోషల్ మీడియా పోస్ట్ వ్యవహారంలో వరుణ్ కుమార్ ఎఎన్‌టీకే పార్టీకి సంబంధించిన కొంతమంది అనుచరులను అరెస్టు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న ఎన్‌టీకే కార్యకర్తలు వరుణ్ కుమార్ ను టార్గెట్ చేశారు.
వరుణ్ కుమార్ ను టార్గెట్ చేయడంతోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని వరుణ్ కుమార్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎస్పీ వరుణ్ కుమార్ పోలీసులకు గతంలోని ఫిర్యాదు చేశాడు. తనతోపాటు తన భార్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వ్యవహారంపై మొత్తం రెండు కేసులు నమోదయ్యాయి. వీరిపై అసభ్యకర పోస్టులు పెట్టిన నిందితులపై చర్యలు తీసుకోవడంతోపాటు, సోషల్ మీడియా వేదికల నుండి అభ్యంతర ఫోటోలు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు లేఖలు సైతం రాశారు. తమిళనాడు పోలీస్ నుండి సైతం ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సంస్థలకు లేఖలు రాశారు. అయినా సరే సోషల్ మీడియా సంస్థల నుండి ఎలాంటి స్పందన లేదని ఎస్పీ వరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..