వంశపారంపర్య రాజకీయాలను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు డీఎంకే పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పర్యటనలో భాగంగా అమిత్ షా ఆదివారం పుదుక్కోట్టైలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై దాడి చేసిన ఆయన, ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 ఏప్రిల్‌లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

వంశపారంపర్య రాజకీయాలను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది: అమిత్ షా
Amit Shah Attack Dmk Overnment

Updated on: Jan 04, 2026 | 9:39 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు డీఎంకే పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పర్యటనలో భాగంగా అమిత్ షా ఆదివారం పుదుక్కోట్టైలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై దాడి చేసిన ఆయన, ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 ఏప్రిల్‌లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని అమిత్ షా అన్నారు. భారతదేశంలో ఎక్కడైనా అత్యంత అవినీతి ప్రభుత్వం ఉంటే, దురదృష్టవశాత్తు అది తమిళనాడులోనే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ – ఏఐఏడీఎంకే సహా మిత్రపక్షాలతో బలమైన కూటమిని ఏర్పాటు చేయబోతోందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ – డీఎంకేలకు తుది పోరాటం ఇవ్వడానికి మా కూటమి సిద్ధంగా ఉంది. స్టాలిన్ ప్రభుత్వంతో ప్రజలు కూడా విసుగు చెందారు. తమిళనాడు ప్రజలు డీఎంకే ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. 2026 ఏప్రిల్‌లో తమిళనాడులో ఒక పెద్ద మార్పు జరగబోతోంది అని అమిత్ షా స్పష్టం చేశారు.

తమిళనాడులో మహిళల భద్రతకు ఎటువంటి హామీ లేదని హోంమంత్రి అమిత్ షా స్టాలిన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వానికి ఒకే ఒక లక్ష్యం ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా చేయడం, కానీ ఎన్డీఏ వారిని విజయం సాధించనివ్వదన్నారు అమిత్ షా. తమిళనాడులో వంశపారంపర్య రాజకీయాలను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. “తమిళనాడు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్‌లో ఇది నిజంగా కాబోతుంది” అని అమిత్ షా అన్నారు.

తమిళ భాషకు సంబంధించి స్టాలిన్‌పై ఒక పెద్ద ఆరోపణ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎంకే స్టాలిన్ పార్టీ ఇప్పుడు తమిళనాడులో ఎన్డీఏ తమిళ భాషకు వ్యతిరేకం అని ప్రచారం ప్రారంభించిందని అన్నారు. ఇది అబద్ధం.. భారతదేశంలోని ప్రతి భాషను ప్రేమిస్తాము. వాటిలో తమిళం కూడా ఒకటి. “ఈ రోజు తమిళనాడు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, అభ్యర్థులు తమిళంలో ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలు రాయడానికి అనుమతించే ప్రక్రియను ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే. ఎన్డీఏ ఈ భాషకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. స్టాలిన్ పార్టీ ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది” అని అమిత్ షా అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..