
ప్రజెంట్ జనరేషన్ యూత్‌లో బరువు తగ్గాలి, స్లిమ్‌గా కనిపించాలనే కోరిక పెరిగిపోతుంది. ఇందు కోసం కొంత మంది డాక్టర్ సలహాలు, జిమ్ ట్రైనింగ్ చేస్తుంటే మరికొందరు మాత్రం.. యూట్యూబ్, చాట్‌జీపిటి వంటి వాటి సలహాలతో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కన్యాకుమారిలో వెలుగు చూసింది. యూట్యూబ్ చూసి బరువు తగ్గడానికి ప్రయత్నించిన ఒక విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. గత మూడు నెలలుగా బరువు తగ్గడానికి కేవలం పండ్ల రసం తాగుతూ వ్యాయామం చేస్తున్న ఆ విద్యార్థి ఊపిరాడక కుప్పకూలిపోయి విషాదకరంగా మరణించాడు . ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారిలోని బర్నత్విలైకి చెందిన శక్తిశ్వర్ అనే 17 ఏళ్ల యువకుడు స్థానికంగా ఉన్న ఇంటర్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంజనీరింగ్ కళాశాలలో చేరడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో గురువారం (జూలై 24,) ఉదయం, శక్తిశ్వర్ ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానికి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ శక్తిశ్వర్‌ను పరీక్షించిన వైద్యులు అతని చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుకొని మృతదేహాన్ని పరీశించారు. ఘటనపై కేసు నమోదు చేసి అతని తల్లిదండ్రుల సహాయంతో విద్యార్థి మరణంపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శక్తిశ్వర్ బరవు తగ్గేందుకు డైట్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్ చేస్తున్న అతను అధిక బరువుతో, కాలేజీకి వెళితే తోటి విద్యార్థులు తనను ఎగతాళి చేస్తారని భావించిన బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను యూట్యూబ్‌ను వినియోగించుకున్నాడు. యూట్యూబ్‌లో చెప్పిన ప్రకారం డైట్, వ్యాయామం చేయడం ప్రారంభించాడు. దీని కోసం, గత మూడు నెలలుగా ఇతర ఆహార పదార్థాలు తినడం మానేసి.. కేవలం ఫ్రూట్ జ్యూస్‌ను మాత్రమే తాగుతూ శక్తిశ్వర్ వ్యాయామం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి జలుబు రావడం, శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడడం స్టార్ట్ అయ్యింది. ఇంతలోనే గురువారం అకాస్మాత్తుగా స్పృహ కోల్పోయి మరణించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ప్రస్తుత కాలంలో చాలా మందికి బరువు తగ్గాలని, స్లిమ్‌గా కనిపించాలని కోరిక ఉంటుంది. దీని కారణంగానే చాలా మంది డైట్, వ్యాయామం చేస్తున్నారు. ఆ విషయంలో బరువు తగ్గడానికి డైటింగ్, వ్యాయామం చేస్తున్న విద్యార్థి ఇలా హఠాత్తుగా మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.