తిలకాలను ప్రైవేట్‌ పార్ట్స్‌తో పోల్చిన మంత్రి..! పార్టీ పదవి నుంచి తొలగించిన డీఎంకే

డీఎంకే సీనియర్ నేత కె. పొన్ముడి హిందూ మతపరమైన తిలకాలను లైంగిక స్థానాలతో పోల్చిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళితో సహా అనేక మంది ఖండించారు. పొన్ముడిని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుండి తొలగించారు. ఈ ఘటన హిందూ విశ్వాసాలపై దాడిగా బీజేపీ అభివర్ణించింది.

తిలకాలను ప్రైవేట్‌ పార్ట్స్‌తో పోల్చిన మంత్రి..! పార్టీ పదవి నుంచి తొలగించిన డీఎంకే
Ponmudi With Udhayanidhi St

Updated on: Apr 11, 2025 | 1:29 PM

తమిళనాడు అటవీ శాఖ మంత్రి. డీఎంకే సీనియర్ నేత కె పొన్ముడి ఒక బహిరంగ కార్యక్రమంలో హిందూ మతపరమైన తిలకాలను లైంగిక స్థానాలతో అనుసంధానిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ ఈవెంట్‌లో పొన్ముడి ప్రసంగిస్తూ.. వేశ్యలతో పాటు, శైవ, వైష్ణవ తిలకాలను అవమానించేలా మాట్లాడారంటూ ఆయనపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. పొన్ముడి వ్యాఖ్యాలను డీఎంకే ఎంపీ కనిమొళి కూడా ఖండించారు. ఆమెతో పాటు నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు, గాయని చిన్మయి శ్రీపాద కూడా పొన్ముడి వ్యాఖ్యలపై మండిపడ్డారు. “దీనిని శిక్షించే ఏదో ఒక రకమైన దైవత్వం లేదా దేవత లేదా దేవుడు ఉండాలి.” అంటూ బీజేపీ ఐటి సెల్ ఇంఛార్జ్‌ అమిత్ మాల్వియా పేర్కొన్నారు.

దీనిని హిందూ మతంపై డీఎంకే చేస్తున్న దాడుల కొనసాగింపుగా ఆయన అభివర్ణించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, మాల్వియా మాట్లాడుతూ, “డీఎంకె, కాంగ్రెస్, టీఎంసీ లేదా ఆర్జెడి అయినా, ఇండి కూటమి సభ్యులు భావజాలం ద్వారా కాదు, హిందూ విశ్వాసాల పట్ల ఉమ్మడి అసహ్యం ద్వారా ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది” అని అన్నారు. అయితే.. పొన్ముడి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో డీఎంకే చర్యలు తీసుకుంది. పొన్ముడిని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.