తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆ ప్రాంతాలలోనే ఎక్కువగా వర్ష ప్రభావం.. ఎక్కడంటే?..

|

Dec 15, 2020 | 8:49 PM

రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారత్‏లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సౌత్ భారత్‏లోని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని

తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆ ప్రాంతాలలోనే ఎక్కువగా వర్ష ప్రభావం.. ఎక్కడంటే?..
Follow us on

రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారత్‏లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సౌత్ భారత్‏లోని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఈ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎక్కువగా వర్షం పడే ప్రభావం ఉందని తెలిపింది. ఈ విషయాన్ని వాతావరణశాఖ ట్విట్టర్‏లో పోస్ట్ చేసింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో డిసెంబర్ 16 నుంచి 18 మధ్య ఈ భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. అంతేకాకుండా కేరళ, లక్షద్వీప్‏లలో డిసెంబర్ 17 నుంచి 18 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా డిసెంబర్ ప్రారంభంలో వారం రోజుల తేడాతో వచ్చిన నివర్, బురేవి తుఫాన్ల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలను మళ్ళీ ఈ భారీ వర్షాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.