నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించిన వ్యక్తికి.. ఫుడ్ కమిషన్ సభ్యునిగా నియమించిన తమిళ సర్కార్!

కోయంబత్తూరులోని శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ వ్యవస్థాపకుడు శ్రీనివాసన్‌ను తమిళనాడు ఫుడ్ కమిషన్ సభ్యునిగా నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చెన్నై సచివాలయంలో ముఖ్యమంత్రిని శ్రీనివాసన్ స్వయంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. కోయంబత్తూరు ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శాఖలను కలిగి ఉంది.

నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించిన వ్యక్తికి.. ఫుడ్ కమిషన్ సభ్యునిగా నియమించిన తమిళ సర్కార్!
Nirmala Sitharaman, Kovai Annapoorna Srinivasan, Cm Mk Staln,

Edited By:

Updated on: Apr 18, 2025 | 8:37 PM

కోయంబత్తూరులోని శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ వ్యవస్థాపకుడు శ్రీనివాసన్‌ను తమిళనాడు ఫుడ్ కమిషన్ సభ్యునిగా నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చెన్నై సచివాలయంలో ముఖ్యమంత్రిని శ్రీనివాసన్ స్వయంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. కోయంబత్తూరు ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శాఖలను కలిగి ఉంది.

గతేడాది కోయంబత్తూరులో జరిగిన చిన్న, సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారుల సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను శ్రీ అన్నపూర్ణ వ్యవస్థాపకుడు శ్రీనివాసన్‌ ప్రశ్నలు సంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘మిఠాయిలపై తక్కువ జీఎస్టీ, రుచికరమైన ఉత్పత్తులపై ఎక్కువ జీఎస్టీ విధించారు. దీంతో బిల్లులు చెల్లించడం కష్టమవుతోంది. బన్స్‌పై జిఎస్‌టి లేదు, కానీ వాటిపై వేసే క్రీమ్‌పై జిఎస్‌టి విధిస్తారా అని ఆయన ప్రశ్నించారు. అయితే అనంతరం శ్రీనివాసన్.. నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెబుతున్న వీడియోను బీజేపీ షేర్ చేయడం వివాదం సృష్టించింది.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా వివిధ రాజకీయ నేతలు దీనిని ఖండించారు. తదనంతరం, శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఆర్థిక మంత్రిని వ్యక్తిగతంగా కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు పేర్కొంది. నిజానికి, సెప్టెంబర్ 11న, నిర్మలా సీతారామన్ కోయంబత్తూరులో జరిగిన ఒక సమావేశానికి హాజరయ్యారు. వ్యవస్థాపకులతో జరిగిన సంభాషణ సందర్భంగా, శ్రీనివాసన్ GST నిష్పత్తిలో ఉన్న అసమానతపై తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్నపూర్ణ శ్రీనివాసన్ సాంప్రదాయ హోటళ్లకు ప్రసిద్ధి చెందింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..