
Onions Gifted New Couple: ఉల్లిపాయలు ఎప్పుడూ కన్నీళ్లు తెప్పిస్తే.. ఉన్నట్లుండి అమాంతం కొండెక్కే ఉల్లిపాయ ధరలు కూడా అప్పుడప్పుడు ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఉల్లిపై సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతుంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉల్లిపాయ ధరలు పెరగడంతో ప్రజలంతా ఉల్లి వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే కొంతమంది వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి సమయంలో జరిగే శుభకార్యాలకు ఉల్లిని బహుమతిగా ఇస్తుంటారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరగ్గా.. ఇప్పుడు తమిళనాడులో జరిగింది.
తిరువళ్లూరు జిల్లా అరణిలో సెంథిల్ కుమార్, షబితలకు ఇటీవల వివాహం జరిగింది. ఈ వేడుకకు వచ్చిన బంధువులు నూతన వధూవరులకు ఐదు కిలోల ఉల్లిపాయలను కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ గిఫ్ట్‌తో కొత్త దంపతులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
Read More: