అసెంబ్లీ లోపలా.. బయటా.. అదే బ్యాలెన్స్.. హీరోయిక్ స్టయిల్‌లో దళపతి గవర్నెన్స్!

45 సెకన్ల కోకోకోలా యాడ్‌ చెయ్యడానికే 12 కోట్ల రూపాయలు ఇచ్చి రెడ్‌ కార్పెట్ వేశారు. 30 ఏళ్లలో 70 సినిమాల్లో హీరోగా చేశారు. వందల కోట్ల రెమ్యూనరేషన్‌ని వదిలిపెట్టి.. సినిమాకు టాటా చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, అతడొక నటుడు, అతడి పార్టీ కూడా నటుల పార్టీ.. అని ఎగతాళిగా మాట్లాడారు. అయినా వెనక్కు తగ్గలేదు, ఎన్నో కుట్రలను, కుతంత్రాలను దాటుకుని, థంపింగ్ విక్టరీ కొట్టాడు. తమిళనాట టార్చ్‌బేరర్ అనిపించుకున్నాడు. అవును, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. మోస్ట్ ట్రెండీ పొలిటికల్ స్టార్‌గా మేకోవర్ అయ్యారు. మళ్లీ సినిమాతో తనకుండే ఎటాచ్‌మెంట్‌ని గుర్తు చేసుకున్నారు.

అసెంబ్లీ లోపలా.. బయటా.. అదే బ్యాలెన్స్.. హీరోయిక్ స్టయిల్‌లో దళపతి గవర్నెన్స్!
Tamil Nadu Cm Joseph Vijay

Updated on: Jun 23, 2026 | 9:50 PM

తమిళంలో మున్నేట్రం అంటే ప్రగతిశీలం అనీ, ప్రోగ్రెసివ్ అనీ ఒక అర్థం ఉంది. డీఎంకే, పీఎంకే, అన్నాడీఎంకే, ఆ ఎంకే.. ఈ ఎంకే.. అని అక్కడ ఏ పార్టీ పేరును డీకోడ్ చేసినా మున్నేట్రం అనే సౌండ్ కచ్చితంగా ఉంటుంది. కానీ, తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఇంచయినా ప్రోగ్రెస్ లేదు. అప్‌డేట్ వెర్షన్లు అసలే ఉండవు. వాడుపోతే వీడు.. వీడు పోతే వాడు. ఒక డీఎంకే పోతే ఇంకో డీఎంకే రావడమే తప్ప అక్కడ మారిందంటూ ఏమీ లేదు. ఏడెనిమిది దశాబ్దాల పాటు రొడ్డకొట్టుడు రొటీన్‌ రాజకీయాలతో విసిగిపోయిన తమిళ జనాలకు విజయ్ అరంగేట్రంతో గొప్ప రిలీఫ్ దొరికింది. పంచెకట్టు పాలిటిక్స్‌ని మడతబెట్టి, తనదైన మాస్ పాలిటిక్స్‌కి, జెన్‌జీ గవర్నెన్స్‌కి గెట్‌సెట్‌ గో చెప్పారు దళపతి విజయ్. ఏ రోజుకారోజు స్టయిలిష్‌ పెర్ఫామెన్స్‌తో ఒకేఒక్కడు టైటిల్‌ని నిలబెట్టుకుంటున్నారు. మాటలతో కాదు, చేతలతో కొడతా అన్నట్టుంది దళపతి స్టయిలాఫ్. మాస్‌ వార్నింగ్‌. పవర్‌లోకి వచ్చి నెలన్నరైనా కాలేదు, అంతలోనే సంచలన నిర్ణయాలతో ట్రెండీగా మారాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖరన్. మోస్ట్ పాపులర్ చీఫ్‌ మినిస్టర్ అనే ట్యాగ్‌ని చాలా ఈజీగా సొంతం చేసుకున్నాడని విశ్లేషణలోకి వస్తున్నాయి. పార్టీని, ప్రభుత్వాన్నీ ఒంటిచేత్తో నడిపిస్తూ, సైలెన్స్‌గా తనపని తాను...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి