Valentines Day: మామూలు హోటళ్లలోనే ఉచిత బస అంటే.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తాం. అలాంటిది ‘తాజ్ హోటల్’లో ఉచిత బస అంటే ఎవరైనా ఆగుతారా? ఎగిరి గంతేసి ఛలో అని హోటల్‌కు బయలుదేరుతారు. ఆ ఆశను ఆసరాగా చేసుకునే తాజాగా కొందరు మాయగాళ్లు రెచ్చిపోయారు. వివరాల్లోకెళితే.. మరికొద్ది రోజుల్లో వాలెంటైన్స్ డే రానుంది. ప్రేమికులకు వాలెంటైన్స్ డే ఎంతో ప్రత్యేకమైనది. ఆ రోజున సమ్‌థింగ్ స్పెషల్‌గా ప్లాన్ వేసుకుంటారు ప్రేమికులు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ‘తాజ్ హోటల్’ పేరుతో నయా మోసానికి తెరలేపారు. ఓ వెబ్‌సైట్ క్రియేట్ చేసి.. ‘తాజ్ ఎక్స్‌పీరియన్స్ గిఫ్ట్ కార్డ్’ పేరిట వాలెంటైన్స్ డే ఆఫర్‌ను ప్రకటించారు. వాలెంటైన్స్ డే సంరద్భంగా తాజ్ హోటల్‌లో ఉచితంగా బస చేయడానికి కూపన్ అందిస్తున్నట్లు సదరు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. దాని తాలూకు లింక్‌ను వాట్సప్ యూజర్లకు పంపిస్తున్నారు.
అయితే ఆ లింక్‌పై అనుమానం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు.. విషయాన్ని తాజ్ హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని హోటల్ యాజమాన్యం షాక్ అయ్యింది. వెంటనే వివరణ ఇస్తూ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘గుర్తు తెలియని వ్యక్తులు వాలెంటైన్స్ డే ఆఫర్ అంటూ తాజ్ హోటల్ పేరుతో ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తాజ్ హోటల్స్ గానీ, హెచ్ఐసీఎల్ గానీ వాలెంటైన్స్ డే కి సంబంధించి ఎటువంటి ప్రమోషన్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. తమ హోటల్ పేరిట వచ్చే ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించాలని అభ్యర్థిస్తున్నాము.’ అంటూ ‘తాజ్’ యాజమాన్యం స్పష్టం చేసింది.
Taj Hotels Tweet:
It has come to our notice that a website has been promoting a Valentine’s Day initiative, offering a Taj Experiences Gift Card via WhatsApp. We would like to inform that Taj Hotels/IHCL has not offered any such promotion. We request to take note of this and exercise due caution.
— Taj Hotels (@TajHotels) January 30, 2021
Also read:
Crime News: ఆస్తి తగాదాలు.. మాజీ మంత్రి కోడులు, మనవరాలిని దారుణంగా చంపిన దుండగులు..
Ramayanam: రాముడిగా హృతిక్‌రోషన్… సీతగా దీపికా పదుకొణె.. త్రీడీలో రామాయాణం…