Swadeshi Movement: భారత స్వాతంత్రోద్యమంలో పెద్ద మలుపు ‘స్వదేశీ ఉద్యమం’..ఇది ఎందుకు..ఎప్పుడు ప్రారంభం అయిందో తెలుసా?
భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన నిరసనోద్యమం 'స్వదేశీ ఉద్యమం'. ఈ ఉద్యమం ఆగస్ట్ 7, 1905న శ్రీకారం చుట్టుకుంది.
Swadeshi Movement: భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన నిరసనోద్యమం ‘స్వదేశీ ఉద్యమం’. ఈ ఉద్యమం ఆగస్ట్ 7, 1905న శ్రీకారం చుట్టుకుంది. ఈ ‘స్వదేశీ ఉద్యమం’ బ్రిటిష్ పాలకులకు వెన్నులో చలి పుట్టించింది. అసలు ఈ ఉద్యమం ఎందుకు ప్రారంభం అయింది. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం.
బెంగాల్ విభజన..
భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ 20 జూలై 1905న విభజనను ప్రకటించాడు. అక్టోబర్ 1905 లో బెంగాల్ విభజన జరిగింది. లార్డ్ కర్జన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారతదేశమంతా తీవ్రంగా వ్యతిరేకించింది. నిజానికి, బెంగాల్ విభజన వెనుక, భారతీయుల హిందూ-ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్ర ఉంది. బ్రిటీష్ వారు ముస్లింలు అధికంగా ఉండే తూర్పు భాగాన్ని అస్సాంలో విలీనం చేసి ప్రత్యేక ప్రావిన్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ పేరు పెట్టడానికి హిందువులు ఎక్కువగా ఉండే పశ్చిమ భాగాన్ని బీహార్, ఒరిస్సాలో విలీనం చేశారు. అంటే, రెండు ప్రావిన్సులలో రెండు వేర్వేరు మతాలను మెజారిటీగా చేయాలని బ్రిటిష్ వారు కోరుకున్నారు.
దేశవ్యాప్తంగా విభజన నిరసన ప్రారంభమైంది. 7 ఆగస్టు 1905 న, కలకత్తా టౌన్ హాల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు అయింది. లక్షలాది మంది ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో స్వదేశీ ఉద్యమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో నాయకులు ప్రభుత్వ సేవలు, పాఠశాలలు, కోర్టులు, విదేశీ వస్తువులను బహిష్కరించాలని అదేవిధంగా, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని భారతీయులకు విజ్ఞప్తి చేశారు. అంటే, ఇది రాజకీయ ఉద్యమం అలాగే ఆర్థిక ఉద్యమం.
విదేశీ దుస్తులను దేశవ్యాప్తంగా కాల్చివేయడం ప్రారంభించారు ప్రజలు. అదేవిధంగా చెప్పులు లేకుండానే ప్నిరజలు నిరసనలలో పాల్గొనడం ప్రారంభించారు. విదేశీ వస్తువుల బహిష్కరణ ప్రభావం భారతదేశంలో విదేశీ వస్తువుల అమ్మకం పూర్తిగా తగ్గింది. స్వదేశీ వస్తువుల అమ్మకం పెరగడం ప్రారంభమైంది.
బ్రిటిష్ వారి ఈ నిర్ణయానికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ ‘అమర్ షోనార్ బంగ్లా’ కూడా వ్రాసాడు, తరువాత ఇది బంగ్లాదేశ్ జాతీయ గీతంగా మారింది. ప్రజలు ఈ పాటను పాడుతూ నిరసనలలో పాల్గొనేవారు. హిందువులు, ముస్లింలు తమ ఐక్యతను చాటుకోవడానికి ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు.
అటువంటి విస్తృతమైన నిరసనలు కూడా బ్రిటిష్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. లార్డ్ కర్జన్ ప్రకటన ప్రకారం, బెంగాల్ విభజన అక్టోబర్ 16 న అమలులోకి వచ్చింది. బాధపడిన భారతీయులు అక్టోబర్ 16 న జాతీయ సంతాప దినోత్సవాన్ని జరుపుకున్నారు.
Also Read: Library Book: 50 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం.. గొప్ప సందేశమిచ్చిన కథనం
అస్సాం-మిజోరాం మధ్య మళ్ళీ బార్డర్ రగడ.. నాలుగు లారీలు ధ్వంసం