
సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడుతున్న విషయం అతని తలిదండ్రులు ఇతరులకు తెలియదట..కానీ అతని సిస్టర్స్ కి మాత్రం ఇది తెలుసునని వెల్లడైంది. 2013 లో సుశాంత్ సైకియాట్రిస్ట్ ను సంప్రదించాడని అతని సిస్టర్స్ నీతూ సింగ్, ప్రియాంక సింగ్, మీతూ సింగ్ సీబీఐ అధికారులకు తెలిపారు. సుశాంత్ ఈ రుగ్మతతో బాధపడుతున్న సంగతి తమకు తెలియదని అతని తలిదండ్రులు బీహార్ పోలీసులకు ఇఛ్చిన వాంగ్మూలంలో తెలిపారు. కానీ వీరు మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా చెప్పడం విశేషం. సుశాంత్ తో కొన్ని రోజులు అతని వెంటే ఉండి అతని మృతికి రెండు రోజుల ముందే వెళ్ళిపోయిన మీతూ సింగ్.. తానెంతో దిగాలుగా ఉన్నట్టు సుశాంత్ గత ఏడాది చెప్పాడని తెలిపింది. దీంతో తాను ఢిల్లీ, హర్యానాల నుంచి ప్రియాంకను, నీతూ సింగ్ ని ముంబైకి రప్పించానని ఆమె చెప్పింది.