సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు…విసేరా రిపోర్టులో ఏముందంటే ?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మృతి కేసుకు సంబంధించి విసేరా రిపోర్టు సోమవారం ముంబై పోలీసులకు అందింది. ఆయన ఆత్మహత్య కేసులో అనుమానించదగిన అంశాలు..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు...విసేరా రిపోర్టులో ఏముందంటే ?

Edited By:

Updated on: Jul 27, 2020 | 3:58 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మృతి కేసుకు సంబంధించి విసేరా రిపోర్టు సోమవారం ముంబై పోలీసులకు అందింది. ఆయన ఆత్మహత్య కేసులో అనుమానించదగిన అంశాలు కనబడలేదని ఈ నివేదిక తెలిపింది. అంటే హింస లేదా ఘర్షణ జరిగి ఉంటుందనడానికి ఆధారాలను ఈ రిపోర్టు తోసిపుచ్చింది. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరి ఆడక ఆయన మృతి చెందారని పోస్ట్ మార్టం నివేదిక ఇదివరకే స్పష్టం చేసింది. ఇక సుశాంత్ గోళ్లు, కడుపునకు సంబంధించిన వాష్ ఫ్లూయిడ్ నమూనాల రిపోర్టు అందవలసి ఉంది. ఒకవేళ ఘర్షణ పడి  ఉంటే ఎలాంటి గాయాల తాలూకు గుర్తులు గానీ ఉన్నాయా అన్న విషయం ఈ రిపోర్టు ద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నెల 13 న వారు అయిదుగురు ఫోరెన్సిక్ టీమ్ సభ్యులను కలుసుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ఒక్కొక్కరిని విడివిడిగా కూడా విచారించారు. అనంతరం ఈ కేసులో ‘సెన్సేషనల్’అంశాలేవీ లేవని నిర్ధారించారు.

సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 37 మందిని విచారించారు. వీరిలో మహేష్ భట్ వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us