ఎయిమ్స్ డాక్టర్లపై సుశాంత్ కుటుంబం మండిపాటు

| Edited By: Pardhasaradhi Peri

Oct 07, 2020 | 5:06 PM

సుశాంత్ కేసులో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ విభాగం ఇఛ్చిన రిపోర్టుపై సుశాంత్ కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విభాగం హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తా అన్ ప్రొఫెషనల్..

ఎయిమ్స్ డాక్టర్లపై సుశాంత్ కుటుంబం మండిపాటు
Follow us on

సుశాంత్ కేసులో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ విభాగం ఇఛ్చిన రిపోర్టుపై సుశాంత్ కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విభాగం హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తా అన్ ప్రొఫెషనల్ అని, కావాలనే  ..కొన్ని విషయాలను ఎంపిక చేసి మరీ  మీడియాకు  లీక్ చేశాడని ఈ కుటుంబం ఆరోపించింది. ప్రభుత్వ, మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ని అతిక్రమించి ఆయన వ్యవహరించాడని దుయ్యబట్టింది. సుశాంత్ ది  హత్య కాదని, ఆత్మహత్యే నని సుధీర్ గుప్తా తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే సుశాంత్ కి సంబంధించిన తాజా ఎటాప్సీ, విసెరా నివేదికలను మరొక మెడికల్ బోర్డు లేదా మరో ఫోరెన్సిక్ విభాగం అధ్యయనం చేయాలని సుశాంత్ ఫ్యామిలీ సీబీఐ కి రాసిన లేఖలో కోరింది. ఇలా ఉండగా.. సుశాంత్ ని ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చునన్న కోణంలో సీబీఐ తన దర్యాప్తును కొనసాగిస్తోంది.