Viral: పార్కింగ్ స్థలంలో ఊడుస్తుండగా స్వీపర్‌కి కనిపించిన ప్యాకెట్స్.. వాటిని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

|

Jun 25, 2022 | 3:36 PM

సూరత్‌లోని కాటార్‌గామ్‌లో గల పంచదేవ్ అనే ఫ్యాక్టరీలో వినోద్ స్వీపర్​గా పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీలోని పార్కింగ్​ స్థలంలో ఊడుస్తున్నప్పుడు అతనికి రెండు ప్యాకెట్లు కనిపించాయి.

Viral: పార్కింగ్ స్థలంలో ఊడుస్తుండగా స్వీపర్‌కి కనిపించిన ప్యాకెట్స్.. వాటిని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్
A representative image
Follow us on

Trending: ప్రపంచం ఇప్పుడు ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డబ్బు కోసం ఎంతటి దారుణాలకు అయినా దిగజారుతున్నారు కొందరు. అలాంటి ఫ్రీగా రోడ్డుపై డబ్బు కానీ, బంగారం కానీ, డైమండ్స్ కానీ వదిలిపెడతారు. చటుక్కున జేబులో పెట్టుకుని.. వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు. వాటిని పోగొట్టుకున్నవారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు.. అనే ఆలోచన కనీసం చేయరు. అయితే పని చేసే జాబ్ తక్కువ స్థాయి తక్కువైనా, తన గుణం తక్కువ కాదు అని నిరూపించాడు ఓ స్వీపర్. తన దొరికిన డైమండ్స్‌ను యజమానికి అందజేసి.. తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌(Surat)లోని కాటార్‌గామ్‌(Katargam)లో గల పంచదేవ్ అనే ఫ్యాక్టరీలో వినోద్ స్వీపర్​గా వర్క్ చేస్తున్నాడు. డైలీ మాదిరిగానే ఫ్యాక్టరీలోని పార్కింగ్​ స్థలంలో ఊడుస్తున్నప్పుడు అతనికి రెండు ప్యాకెట్లు కనిపించాయి. వాటిని ఓపెన్ చేయగా ఒక్కసారిగా కంగుతిన్నాడు.  అందులో వజ్రాలు మెరుస్తూ కనిపించడంతో.. ఒక్కసారిగా షాకయ్యాడు. అలాగని వాటిని గుట్టుగా దాచుకుని ఇంటికెళ్లలేదు.  ఆ వజ్రాల ప్యాకెట్లను తీసుకుని.. సేత్నే డైమండ్ అసోసియేషన్‌ను సంప్రదించాడు. వారికి తనకు అవి దొరికిన విషయం చెప్పాడు. వాటి విలువ రూ. లక్ష ఉంటుందని సేత్నే డైమండ్ అసోసియేషన్‌ వారు చెప్పారు. ఎవరు పోగొట్టుకున్నారన్న దానిపై వివరాలు సేకరించారు. ఆ ప్యాకెట్స్ రమేశ్‌భాయ్‌కు చెందినవిగా గుర్తించారు. రమేశ్‌భాయ్‌కు వాటిని అందజేసి.. వినోద్​ నిజాయతీని మెచ్చుకుని అతడిని సన్మానించారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..