Anand Mohan: డాన్‌ ఆనంద్‌మోహన్‌‌ను ఎలా విడుదల చేశారు.. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు..

|

May 08, 2023 | 1:55 PM

ఏప్రిల్ 27న బీహార్ సహర్సా జైలు నుంచి ఆనంద్ మోహన్ ఉదయం 6.15 గంటలకు విడుదలయ్యారు. అతని కొడుకు పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి విడుదలైన తర్వాత నేరుగా డెహ్రాడూన్‌కి వెళ్లిపోయాడు. అయితే ఆనంద్‌మోహన్‌ విడుదలపై బీహార్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Anand Mohan: డాన్‌ ఆనంద్‌మోహన్‌‌ను ఎలా విడుదల చేశారు.. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన  సుప్రీంకోర్టు..
Anand Mohan
Follow us on

బీహార్‌ డాన్‌ ఆనంద్‌మోహన్‌ విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జైలు రూల్స్‌ను మార్చి ఆనంద్‌మోహన్‌ను విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ దివంగత ఐఏఎస్‌ కృష్ణయ్య భార్య ఉమ దాఖలు చేసిన పిటిషన్‌పై బీహార్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ నిబంధన కింద విడదల చేశారో 15 రోజుల్లో జవాబు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తన భర్తను హత్య చేసిన ఆనంద్‌మోహన్‌ను బీహార్‌ ప్రభుత్వం అన్యాయంగా విడుదల చేసిందని ఉమ ఆరోపించారు.

జీవిత ఖైదు, మరణశిక్షకు ప్రత్యామ్నాయంగా విధించబడినప్పుడు.. కోర్టు నిర్దేశించిన విధంగా ఖచ్చితంగా అమలు చేయబడాలి. ఉపశమనానికి మించినది కాదు అని ఉమా కృష్ణయ్య సుప్రీంకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 14 లేదా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన దోషులను విడుదల చేసేందుకు నితీష్ కుమార్ ప్రభుత్వం జైలు నిబంధనలను సవరించడంతో ఆనంద్ మోహన్ సహర్సా జైలు నుంచి విడుదలయ్యారు . బీహార్ హోమ్ డిపార్ట్‌మెంట్ బీహార్ ప్రిజన్ మాన్యువల్, 2012  నియమం 481 (1-ఎ)లో మార్పును తెలియజేసింది. ఇది “లేదా డ్యూటీలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య” అనే పదబంధాన్ని తొలగించింది.

ఇదిలావుంటే, దివంగత ఐఏఎస్‌ కృష్ణయ్య కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి బీహార్‌ డాన్‌ ఆనంద్‌ మోహన్‌సింగ్‌ సహస్ర జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదల కాగానే ఆనంద్‌ మోహన్‌ అజ్ఞాతం లోకి వెళ్లిపోయాడు. జైలు నిబంధనలను మార్చి అన్యాయంగా ఆనంద్‌ మోహన్‌ను విడుదల చేశారని కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ది కోసమే రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందిన ఆనంద్‌మోహన్‌సింగ్‌ను సీఎం నితీష్‌ విడుదల చేయించారని ఆరోపించారు కృష్ణయ్య భార్య ఉమ.

రాజకీయ లబ్ది కోసమే ఆనంద్‌మోహన్‌సింగ్‌ను జైలు నుంచి విడుదల చేశారని , చిన్నప్పుడే ఆయన వల్ల తమ తండ్రిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణయ్య కూతురు పద్మ, ప్రధాని మోదీ , రాష్ట్రపతి ముర్ము జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలన్నారు. మరోవైపు బీహార్‌లో ఆనంద్‌ మోహన్‌ విడుదలను స్వాగతిస్తూ ఆయన అభిమానులు పలు చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు. సహస్ర జైలు దగ్గరకు భారీ సంఖ్యలో ఆనంద్‌మోహన్‌ అభిమానులు తరలివచ్చారు .

జైలు నుంచి విడుదలైన తరువాత ఆనంద్‌మోహన్‌ తన స్వగ్రామానికి చేరుకున్నాడు. నిబంధనల ప్రకారమే ఆనంద్‌మోహన్‌ను విడుదల చేశామని బీహార్‌ సర్కార్‌ మరోసారి వివరణ ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం