Same Gender Marriage: స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్దత సాధ్యం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కీలకతీర్పును వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహంపై చట్టం చేసే హక్కు పార్లమెంట్‌కే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ పిటిషన్లపై నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

Same Gender Marriage: స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్దత సాధ్యం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Same Gender Marriage

Updated on: Oct 17, 2023 | 2:05 PM

మంగళవారం (17 అక్టోబర్) స్వలింగ సంపర్కులకు చాలా ముఖ్యమైన రోజు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు కల్పిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని చదివి వినిపించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మే నెలలో 10 రోజుల పాటు ఈ వ్యాజ్యాన్ని విచారించింది. దీని తరువాత, ఇది మే 11 న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈ రోజు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

సీజేఐ చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా బెంచ్‌లో సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ హిమా కోహ్లీ మినహా మిగిలిన నలుగురు న్యాయమూర్తులు తీర్పును చదివారు. సుప్రీం కోర్టు మొత్తం నాలుగు తీర్పులు ఇచ్చింది.

స్వలింగ సంపర్కులకు చాలా..

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కీలకతీర్పును వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహంపై చట్టం చేసే హక్కు పార్లమెంట్‌కే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ పిటిషన్లపై నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అభిప్రాయాన్ని వీడాలని కోర్టు తెలిపింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే..

కోర్టులు చట్టాలను రూపొందించవని.. కానీ, వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తాయని సీజేఐ అన్నారు. చట్టసభలు స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే.. మనం మళ్లీ స్వాతంత్ర్యానికి పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని అన్నారు. అయితే, ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని, దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని చెప్పారు. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది.

వివాహేతర జంటలతో పాటు స్వలింగ జంటలు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. పెళ్లి చేసుకున్న ఆడ‌-మ‌గ జంట మాత్రమే పిల్లలకు రక్షణ కల్పిస్తారని అనుకోవడం అపోహ మాత్రమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దత్తత హక్కులను LGBT జంట‌ల‌కు క‌ల్పించ‌క‌పోవ‌డం ఆర్టిక‌ల్ 15ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని సీజేఐ తెలిపారు.

LGBT జంట‌ల‌కు న్యాయపోరాటంలో పాక్షిక విజయం లభించిందని అంటున్నారు న్యాయనిపుణులు. అయితే ఆ జంటలు పిల్లలను దత్తత తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించడం గొప్ప విజయమని అన్నారు న్యాయవాది శివాంగి శర్మ.

మరిన్ని జాతీయ వార్తల కోసం