గోద్రా అల్లర్ల బాధితురాలికి పరిహారం ఇవ్వాల్సిందే.. సుప్రీం తుదితీర్పు

| Edited By:

Sep 30, 2019 | 8:17 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోద్రా అల్లర్ల కేసులో బాధితురాలు బిల్‌కిస్ బానో‌ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2002లో గుజరాత్ జరిగిన గోద్రా మారణకాండలో సజీవ సాక్షిగా బిల్‌కిస్ బానో ఉన్నారు. ఆమెకు జరిగిన అన్యాయంపై సుప్రీం కోర్టు తుది తీర్పు ఊరట కలిగించింది. ఆమెకు రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు రెండు వారాల్లో ఉద్యోగం కల్పించాలని , వసతిని కల్పించాలని అత్యున్నత న్యాయస్ధానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏప్రిల్‌లో కోర్టు ఇచ్చిన […]

గోద్రా అల్లర్ల బాధితురాలికి పరిహారం ఇవ్వాల్సిందే.. సుప్రీం తుదితీర్పు
Follow us on

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోద్రా అల్లర్ల కేసులో బాధితురాలు బిల్‌కిస్ బానో‌ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2002లో గుజరాత్ జరిగిన గోద్రా మారణకాండలో సజీవ సాక్షిగా బిల్‌కిస్ బానో ఉన్నారు. ఆమెకు జరిగిన అన్యాయంపై సుప్రీం కోర్టు తుది తీర్పు ఊరట కలిగించింది. ఆమెకు రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు రెండు వారాల్లో ఉద్యోగం కల్పించాలని , వసతిని కల్పించాలని అత్యున్నత న్యాయస్ధానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏప్రిల్‌లో కోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను పున:సమీక్షించాలన్న గుజరాత్ ప్రభుత్వ విఙ్ఞప్తిని సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ఏప్రిల్ నెలలొ ఇచ్చిన తీర్పులో ఏ పరిహారం ఇవ్వాలని ఉదేశించిందో దాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన తీర్పు ఇచ్చింది.

గోద్రా అల్లర్లు.. దేశ చరిత్రలో ఒక చీకటి మచ్చగా మిగలిన చరిత్రకు ఆనవాలు. 2002లో గుజరాత్‌లో గోద్రా రైల్వే స్టేషన్‌ వద్ద సబర్మతి రైలు తగులబడింది. అయోధ్యలోని బాబ్రీ మసీదు స్దలం వద్ద కరసేవకు వెళ్లివస్తున్న హిందూ యాత్రికులు ఈ రైలు ప్రమాదంలో అత్యధికంగా మృతిచెందారు. ఈ ఘటన అనంతరం ముస్లింలపై దారుణ హింసాకాండ చెలరేగింది.ఇందులో అధికారిక లెక్కల ప్రకారం 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చంపబడినట్టుగా తేల్చారు. అయితే ఈ మరణాలు సంఖ్య 2వేల వరకు ఉండవచ్చని కూడా ఒక అంచానా.

అయితే అదే సమయంలో గుజరాత్ దహోద్ జిల్లా రంధీకాపూర్ గ్రామంలో బిల్‌కిస్ బానో అనే మహిళపై అల్లరి మూకల చేత 22 సార్లు సామూహిక అత్యాచారానికి గురైంది. అప్పటికి ఆమె బిల్‌కిస్ బాను వయసు 19ఏళ్లు, పైగా గర్భవతి కూడా. ఆమెపై ఈ దారుణం జరగడంతోపాటు, మూడేళ్ల ఆమె కూతుర్ని అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ ఘోర ఘటన తర్వాత బిల్‌కిస్ బాను తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఇప్పటికే ఈ కేసులో నిందితులకు శిక్షపడినప్పటికీ బాధితురాలికి ఇన్నాళ్లకు అసలైన న్యాయం జరిగింది. అయితే ఈ కేసులో గత ఏప్రిల్‌లోనే తీర్పు చెప్పినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం మాత్రం మరోసారి సమీక్షించాలని సుప్రీం కోర్టును కోరింది. దాన్ని కోర్టు కొట్టివేస్తూ గత తీర్పును అమలు చేయాలని మరోసారి ఆదేశించింది.