సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు: 33మందికి బెయిల్

| Edited By:

Jul 24, 2019 | 8:08 AM

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో 33మంది బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో గతంలో ఢిల్లీ హైకోర్టు 34మందిని దోషులుగా తేల్చుతూ ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ 34మంది సుప్రీంను ఆశ్రయించారు. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం వారికి బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే ఈ కేసులో శిక్షను అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఇటీవలే కన్నుమూశారు. ఇక ఈ కేసులో మరోసారి వాదనలు వినేందుకు అత్యున్నత న్యాయస్థానం […]

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు: 33మందికి బెయిల్
Follow us on

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో 33మంది బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో గతంలో ఢిల్లీ హైకోర్టు 34మందిని దోషులుగా తేల్చుతూ ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ 34మంది సుప్రీంను ఆశ్రయించారు. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం వారికి బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే ఈ కేసులో శిక్షను అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఇటీవలే కన్నుమూశారు. ఇక ఈ కేసులో మరోసారి వాదనలు వినేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

అయితే 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు సిక్కు మతానికి చెందిన బాడీగార్డులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కర్ఫ్యూ విధించగా.. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3వరకు సిక్కులకు వ్యతిరేకంగా కొంతమంది అల్లర్లు సృష్టించారు. ఇళ్లకు నిప్పంటించి, రాళ్లు రువ్వి వారు తమ నిరసనను తెలిపారు. ఇక ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆ మధ్యన 34మంది దోషులుగా తేల్చుతూ.. శిక్ష ఖరారు చేసింది.