భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ -30 విమానం గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. అసోంలోని మిలన్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న సుఖోయ్ -30 ఎంకేఐ ఫైటర్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మిలన్ పూర్ పంట పొలాల్లో కుప్పకూలింది. కూలిపోయే ముందు అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు పారాచూట్ల సహాయంతో కిందకు దూకారు. వీరిలో ఓ పైలెట్ కాలికి తీవ్ర గాయాలవ్వగా.. మరో పైలెట్‌కి స్వల్ప గాయాలయ్యాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ వర్ధన్ పాండే తెలిపారు. కాగా, ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన ఇద్దరు పైలెట్లను తేజ్‌పూర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Assam: Locals rescue one of the two Indian Air Force (IAF) pilots, whose Su-30 aircraft crashed in Tezpur during a routine training mission, today. The other pilot was also rescued after ejecting safely from the aircraft. pic.twitter.com/xr1lVSUqiA
— ANI (@ANI) August 8, 2019