Sukesh Chandrashekar: మరో సంచలనానికి తెరతీసిన సుఖేష్‌ చంద్రశేఖర్‌.. రైల్వే శాఖకు రూ. 10 కోట్ల విరాళం..

|

Jun 16, 2023 | 3:46 PM

ఆర్థిక నేరాల్లో అరెస్టై జైల్లో ఉన్న ఓ వ్యక్తి.. ఇప్పుడు ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వానికి తన వంతు సాయం చేస్తానంటున్నాడు. ఏకంగా 10 కోట్లు ఇస్తానంటున్నాడు. ఇంతకీ విరాళం తీసుకోవాలా? వద్దా? రైల్వే శాఖలో ఇప్పుడు ఇదే డైలమా! ఈ 10 కోట్ల విరాళం ఆఫర్‌ ఇచ్చింది మరెవరో కాదు.. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై కొన్నాళ్లుగా తీహార్ జైల్లో..

Sukesh Chandrashekar: మరో సంచలనానికి తెరతీసిన సుఖేష్‌ చంద్రశేఖర్‌.. రైల్వే శాఖకు రూ. 10 కోట్ల విరాళం..
Sukesh Chandrasekhar
Follow us on

ఆర్థిక నేరాల్లో అరెస్టై జైల్లో ఉన్న ఓ వ్యక్తి.. ఇప్పుడు ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వానికి తన వంతు సాయం చేస్తానంటున్నాడు. ఏకంగా 10 కోట్లు ఇస్తానంటున్నాడు. ఇంతకీ విరాళం తీసుకోవాలా? వద్దా? రైల్వే శాఖలో ఇప్పుడు ఇదే డైలమా! ఈ 10 కోట్ల విరాళం ఆఫర్‌ ఇచ్చింది మరెవరో కాదు.. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై కొన్నాళ్లుగా తీహార్ జైల్లో ఉంటున్న సుఖేష్ చంద్రశేఖర్. డబ్బులు అంశంలోనే అరెస్టైన సుఖేష్.. ఇంతటి దయార్ధ హృదయంతో ఎందుకు సాయం చేస్తానంటున్నాడు అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఘ నెలకొంది. ఇలా విరాళం ఇవ్వడం ద్వారా సుఖేష్ ఏమైనా ఆశిస్తున్నాడా? అతని వ్యూహం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.

అవును, మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ చంద్రశేఖర్.. మరో సంచలనానికి తెరతీశాడు. రైల్వే శాఖకు ఏకంగా రూ. 10 కోట్ల విరాళం పంపించాడు. తన విరాళానికి సంబంధించి కేంద్రానికి లేఖ కూడా రాశాడు. ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి రూ. 10 కోట్ల విరాళాన్ని అందిస్తానని లేఖలో పేర్కొన్నాడు. తన వ్యక్తిగత నిధుల నుంచి, పన్ను చెల్లించిన డబ్బు నుంచే విరాళంగా ఇస్తున్నానని, వాటిని స్వీకరించాలంటూ విజ్ఞప్తి చేశాడు సుఖేష్.

బలాసోర్ రైలుప్రమాదం దురదృష్టకర దుర్ఘటనగా అభిప్రాయపడిన సుఖేష్‌.. మోడీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవడం గర్వంగా ఉందన్నాడు. అలాగే, తానిచ్చే రూ. 10 కోట్లను బాధిత కుటుంబాల పిల్లల విద్యా ఖర్చుల కోసం వినియోగించాల్సిందిగా కేంద్రాన్ని కోరాడు. తనకు చెందిన శారద ఫౌండేషన్, చంద్రశేఖర్ క్యాన్సర్ ఫౌండేషన్లు… ప్రతిరోజూ పేదల కోసం పనిచేస్తున్నట్టు లేఖలో చెప్పాడు సుఖేశ్‌. నిరుపేదలకు సహాయం చేయడం పౌరుడిగా, ఆర్థిక సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

అయితే, తీహార్‌ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సుఖేశ్‌ పంపిన ఈ ఆర్థిక సాయాన్ని కేంద్రం అంగీకరిస్తుందా? అదే జరిగితే రాజకీయంగా విమర్శకులు ఎలా రియాక్ట్ అవుతారు? వారి అభిప్రాయం ఎలా ఉంటుందనేది కీలకంగా మారింది. ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. రూ. 10 కోట్లు విరాళం ఇవ్వడం ద్వారా సుఖేష్ ఆశిస్తున్నది ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..