Canteen Subsidy Food : పార్లమెంట్ క్యాంటీన్​లో ఇకపై నో సబ్సిడీ.. సుమారు రూ.8 కోట్లు ఆదా అవుతుదని అంచనా..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ క్యాంటీన్​లో సభ్యులకు అందించే సబ్సిడీ నిలిపివేసినట్లుగా  తెలిపారు. దీంతో క్యాంటీన్​లో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి...

Canteen Subsidy Food : పార్లమెంట్ క్యాంటీన్​లో ఇకపై నో సబ్సిడీ.. సుమారు రూ.8 కోట్లు ఆదా అవుతుదని అంచనా..

Edited By:

Updated on: Jan 20, 2021 | 5:52 AM

Canteen Subsidy Food : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ క్యాంటీన్​లో సభ్యులకు అందించే సబ్సిడీ నిలిపివేసినట్లుగా  తెలిపారు. దీంతో క్యాంటీన్​లో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. సబ్సిడీ తొలగించడం వల్ల సుమారు రూ.8 కోట్లు ఆదా అవుతుందని అంచనా. మరోవైపు.., పార్లమెంట్ క్యాంటీన్​ను ఇక నుంచి ‘నార్తన్ రైల్వే’కు బదులు ‘ఇండియన్ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్’ నిర్వహించనుందని బిర్లా స్పష్టం చేశారు.

ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభమవుతాయని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ అవుతుందని.. లోక్​సభ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సమావేశమవుతుందని పేర్కొన్నారు. సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌ ఉంటుందఅన్నారు.

పార్లమెంట్​కు వచ్చే ఎంపీలందరూ తప్పక కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ ఓంబిర్లా సూచించారు. ఆర్​టీపీసీఆర్(RTPCR) పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో జనవరి 27-28 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సభ్యుల ఇంటి వద్ద సైతం కరోనా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బందికీ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసిన టీకా పంపిణీ విధానాలే పార్లమెంట్ సభ్యులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు బిర్లా.