Budget 2021 for Stock Market Telugu: మరికొద్ది సేపట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2021-22 ఏడాదికి గాను బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై చూపిస్తోంది. దీంతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభంలో సెన్సెక్స్ లాభాల బాటలో పయనించింది. 450 పాయింట్లు లాభపడి 46,553 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 13,702 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.03 వద్ద కొనసాగుతోంది. బడ్జెట్‌పై మదుపర్ల అంచనాలను బట్టి సూచీల్లో నేడు ఒడుదొడుకులు కనిపించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
టాక్స్ రిలాక్సేషన్ అంచనాలతో బ్యాంకింగ్ రంగాలైన ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐవోసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీలతో పాటు భారత్ పెట్రోలియం కంపెనీల షేర్లు కూడా లాభాల బాటలో పయనిస్తున్నాయి. మరోవైపు యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, సిప్లా, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.
Also Read:
తెలంగాణాలో మొదటి మహిళా మెకానిక్‌పై కవిత ప్రశంసల వర్షం.. ఆర్ధికంగా అండగా ఉంటామని హామీ