ఆహా.. జమ్మూకాశ్మీర్‌లో ఎంత మార్పు.. శ్రీనగర్‌లోని లాల్ చౌక్ త్రివర్ణ శోభితం.. వీడియో

Srinagar's Lal Chowk: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదాన్ని

ఆహా.. జమ్మూకాశ్మీర్‌లో ఎంత మార్పు.. శ్రీనగర్‌లోని లాల్ చౌక్ త్రివర్ణ శోభితం.. వీడియో
Srinagar's Lal Chowk

Updated on: Aug 07, 2021 | 1:08 PM

Srinagar’s Lal Chowk: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో రూపుమాపేందుకు ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు కాశ్మీర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా సన్నాహాలు కూడా ప్రారంభించింది. అయితే.. ఎల్లప్పుడు బాంబులతో దద్దరిల్లిన ప్రాంతాల్లో.. ప్రస్తుతం కొంతమేర ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. అక్కడక్కడ ఉగ్రవాదం జడలు విప్పుతున్నప్పటికీ.. ఎలాంటి దాడులు జరగకుండా భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే.. తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా శ్రీనగర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్ నిలిచింది. ఒకప్పుడు ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు నీడలా ఉన్న ఈ ప్రాంతంలో త్రివర్ణం రెపరెపలాడుతోంది. తుపాకులు, బాంబుల మోతలతో.. నీరసనకు వేదికగా ఉన్న ఈ ప్రాంతంలో త్రీవర్ణం శోభయామానంగా ప్రకాశిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో..

Also Read:

No Spitting: రోడ్డుపై ఉమ్మి వేసినందుకు రూ.39 లక్షల జరిమానా.. మీరూ ఆ తప్పు చేయకండి..

Viral Video: షాకింగ్ యాక్సిడెంట్.. ఇలాంటి రోడ్డు ప్రమాదాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.. గాలిలో ఎగిరిపడ్డా సేఫ్..!