జమ్మూ కాశ్మీర్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన హిజ్ బుల్ ఉగ్రవాది తండ్రి..ఎవరంటే ..?

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మరణించిన ఉగ్రవాది బుర్హన్ వని తండ్రి ముజఫర్ వని ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు.వృత్తి రీత్యా టీచర్ అయిన ఈయన.. ఈ జిల్లాలోని ట్రాల్ లో గల ఓ స్కూల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.

జమ్మూ కాశ్మీర్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన హిజ్ బుల్ ఉగ్రవాది తండ్రి..ఎవరంటే ..?
Hoist National Flag

Edited By:

Updated on: Aug 15, 2021 | 3:01 PM

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మరణించిన ఉగ్రవాది బుర్హన్ వని తండ్రి ముజఫర్ వని ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు.వృత్తి రీత్యా టీచర్ అయిన ఈయన.. ఈ జిల్లాలోని ట్రాల్ లో గల ఓ స్కూల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు. 2018 జులైలో దక్షిణ కాశ్మీర్ లో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో బుర్హన్ వని చనిపోయాడు. ఈ ఎదురుకాల్పుల ఘటన కాశ్మీర్ లో 5 నెలల పాటు ఆందోళనకు దారి తీసింది. పోలీసు కాల్పులు, ఘర్షణల్లో సుమారు 100 మంది మరణించగా వందలమంది గాయపడ్డారు. 2018 జులై 12 న శ్రీనగర్ కి 83 కి.మీ. దూరంలోని కొకెర్ నాగ్ ప్రాంతంలో బుర్హన్ వని, అతని ఇద్దరు సహచరులు పోలీసు కాల్పుల్లో మరణించారు., పలువురు స్థానిక యువకులను ఉగ్రవాదం వైపు మరలేలా బుర్హన్ ప్రోత్సహిస్తూ వచ్చేవాడని పోలీసులు అప్పట్లోనే తెలిపారు. ఉగ్రవాదులుగా మారాలంటూ వీడియోలు, ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో వారిని రెచ్చగొట్టేవాడని ఖాకీలు గుర్తు చేశారు. అతనిపై 10 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. తన అన్నను పోలీసులు వేధించినందుకు ప్రతీకారంగా అతగాడు చేత తుపాకీ పట్టాడు. అయితే సుమారు 20 ఏళ్ళ ప్రాయంలోనే ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. తన 15 ఏళ్ళ వయస్సులోనే 2010 లో వని ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు.

అలాంటి టెర్రరిస్టు తండ్రి ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్కూల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం విశేషం. కొడుకు టెర్రరిస్టు కార్యకలాపాల వైపు మళ్లినప్పటికీ ఈ తండ్రి తన పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతూ వచ్చాడు. జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఆయన చేత ఈ కార్యక్రమం నిర్వహింపజేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్గనిస్తాన్ లో అమెరికన్ ఎంబసీ అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా ..?

Car Hit: తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. మద్యం మత్తులో పోలీసులను ఢీ కొట్టాడు.. కట్ చేస్తే..

Loading...
Unable to load recommendations.
Follow Us