తీరనున్న టీకామందుల కొరత, రష్యా నుంచి ఇండియాకు అందనున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్

ఇండియాలో వ్యాక్సిన్ కొరత తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇండియాకు శనివారం అందనుంది. ఆ దేశం నుంచి తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు భారత దేశానికి పంపామని...

తీరనున్న టీకామందుల కొరత, రష్యా నుంచి  ఇండియాకు అందనున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్
Sputnik V

Edited By: Anil kumar poka

Updated on: May 01, 2021 | 10:32 AM

ఇండియాలో వ్యాక్సిన్ కొరత తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇండియాకు శనివారం అందనుంది. ఆ దేశం నుంచి తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు భారత దేశానికి పంపామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. 18-44 ఏళ్ళ మధ్య వయస్కులవారికి శనివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ టీకా మందును వారికీ కూడా ఇచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. రష్యాలోని గమలేయా రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎపిడెర్మాలజీ అండ్ మైక్రోబయాలజీ సంస్థ ఈ వ్యాక్సిన్ ని  డెవలప్  చేసింది. ఈ నెల  మొదటివారానికి లక్షా 50 వేల నుంచి 2 లక్షల డోసులు, ఈ మాసాంతం నాటికి 30 లక్షల డోసులస్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇండియాకు అందనుంది. జూన్ నాటికీ  50  లక్షల డోసుల వ్యాక్సిన్ సప్లయ్ చేస్తామని రష్యా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ ని పరిమితంగా వినియోగించేందుకు డీజీసీఐ అనుమతించింది. ఈ టీకామందు దిగుమతికి అనుమతించాలని  డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఇదివరకే ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది. స్పుత్నిక్ తో బాటు గామ్-కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రపంచంలోని 30 దేశాలు ఆమోదించాయి. 21 రోజుల విరామంతో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ని తీసుకోవలసి ఉంటుందని నిపుణులు  సూచిస్తున్నారు.

ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాఅదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ  మధ్య అరగంటకు పైగా ఫోన్ సంభాషణ జరిగిన  సంగతి విదితమే. ఉభయ  దేశాల మధ్య ఈ కోవిడ్  తరుణంలో సహకారం పెరగాలని ఈ సందర్భంగా ఇద్దరూ అంగీకరించారు. ఇండియాకు ఏ విధమైన సహాయం అవసరమైనా చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు.ఇదే సమయంలో రెండు దేశాల మధ్య  ద్వైపాక్షిక సంబంధాలు మరింత      పెరగాలని కూడా భావించారు.  స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్ పై  రష్యా తన  సమాచారాన్ని వివిధ దేశాలతో షేర్ చేసుకోకపోవడంతో మొదట్లో ఈ టీకామందుపై సందేహాలుకలిగాయి. అయితే    ఇది  సురక్షితమైనదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.