IRCTC Special Trains: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఆ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్-ధనపూర్, పూరి-యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ నెల 6వ తేదీ(నేటి నుంచి) మార్చి 31 వరకు ఈ రైళ్లు నడుస్తాయి. ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ వరకు ఒక రైలును నడుపుతారు.
అయితే, తిరుగు ప్రయాణంలో మరో రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వరకు ప్రత్యేక రైలు ఈనెల 12న నడస్తుంది. ఈనెల 9వ తేదీ నుంచి 31 వరకు విశాఖ-లింగంపల్లి మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుస్తాయి. అలాగే ఈ నెల 11 నుంచి కాచిగూడ-విశాఖ రైలు నడస్తుంది. జనవరి 10 వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు లింగంపల్లి-విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
Also read: