Viral: దంపతులు ప్రయాణిస్తున్న కారులో రహస్య అరలు.. లోపల ఏముందో చూసి పోలీసులు షాక్

|

Apr 25, 2022 | 6:01 PM

కేరళ మలప్పురంలోని వలంచేరి వద్ద భార్యాభర్తల నుంచి రూ.కోటి హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 117 సవర్ల గోల్డ్ కూడా సీజ్ చేశారు.

Viral: దంపతులు ప్రయాణిస్తున్న కారులో రహస్య అరలు.. లోపల ఏముందో చూసి పోలీసులు షాక్
Crime News
Follow us on

Gold smuggling: ఇండియాలో గోల్డ్‌కు ఏ రేంజ్ డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో కొంతమంది స్మగ్లర్లు దీన్ని అక్రమ వ్యాపారంగా ఎంచుకున్నారు. ప్రభుత్వ సుంకానికి ఎగనామం పెట్టి రకరకాల పద్దతుల్లో పసిడిని స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో దేశంలోకి అక్రమంగా బంగారం తరలింపు జరుగుతోంది. మెయిన్‌గా బంగారాన్ని అధికంగా వినియోగిస్తున్న ప్రాంతాలకే ఎక్కువగా సరఫరా చేస్తున్నారు. విదేశాలతో సరిహద్దులున్న నగరాలకు గోల్ట్ సరఫరా సులువుగా జరిగిపోతుంది. అక్కడి నుంచి చాకచక్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక డబ్బును ఒకచోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లకుండా బదిలీ చేయడం ఎలా?.. ఎక్కువ రుసుములు వసూలు చేయకుండా శతాబ్దాల తరబడి కొనసాగుతున్న ఒక విధానం ఉంది. ఇక్కడ డబ్బు ఇచ్చేవారు, తీసుకునేవారితో పాటు మరో ఇద్దరు మీడియేటర్స్ ఉంటే చాలు. దీన్నే హవాలా అని పిలుస్తుంటారు.

తాజాగా  కేరళ మలప్పురంలోని వలంచేరి వద్ద భార్యాభర్తల నుంచి రూ.కోటి హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 117 సవర్ల గోల్డ్ కూడా సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన వీరు కోయంబత్తూర్​ నుంచి మలప్పురంలోని వెంగారకు ఈ డబ్బును, గోల్డ్‌ను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ డబ్బు, బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు భార్యాభర్తలు చూపించలేదని, తమ వద్ద అలాంటివేమీ లేవని తెలిపినట్లు పోలీసులు చెప్పారు. కారులో ఏర్పాటు చేసిన రహస్య అరల్లో నోట్ల కట్టలు, బంగారాన్ని దాచి ఉంచారని వెల్లడించారు. ఇటీవలి కాలంలో వలంచేరి పోలీసులు భారీ మొత్తంలో హవాలా డబ్బును గుర్తిస్తున్నారు. ఆరు ఘటనల్లో రూ.8 కోట్ల నగదును సీజ్ చేశారు.

Also Read: Lemon Side Effects: నిమ్మరసం అతిగా తాగుతున్నారా? అయితే ఈ అనర్థాలు మీరు తెలుసుకోవాల్సిందే