AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Fourth Wave: ఢిల్లీలో కరోనా కలకలం.. పక్షం రోజుల వ్యవధిలో ఆరు రెట్లు పెరిగిన..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గత పక్షం రోజులుగా కరోనా కేసులు సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీన్ని ఫోర్త్ వేవ్‌కు సంకేతంగా పరిగణిస్తున్నారు.

Covid-19 Fourth Wave: ఢిల్లీలో కరోనా కలకలం.. పక్షం రోజుల వ్యవధిలో ఆరు రెట్లు పెరిగిన..
Covid
Janardhan Veluru
|

Updated on: Apr 25, 2022 | 6:15 PM

Share

Delhi Covid News: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గత పక్షం రోజులుగా కరోనా కేసులు సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీన్ని ఫోర్త్ వేవ్‌కు సంకేతంగా పరిగణిస్తున్నారు వైద్య నిపుణులు. ఢిల్లీలో గత 15 రోజుల వ్యవధిలో హోం ఐసొలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల సంఖ్య ఏకంగా ఆరు రెట్లు పెరిగాయి. ఏప్రిల్ 11న ఢిల్లీలో హోం ఐసొలేషన్‌లో 447 మంది కరోనా బాధితులు ఉండగా.. ఏప్రిల్ 24 (ఆదివారం) నాటికి ఈ సంఖ్య 2,812కు చేరింది. కరోనా కేసుల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ గణాంకాలు అద్దంపడుతున్నాయి.

ఏప్రిల్ 13న హోం ఐసొలేషన్‌లో 504 మంది కరోనా బాధితులు ఉండగా.. మరుసటి రోజు ఇది 574కు, ఏప్రిల్ 15న ఈ సంఖ్య 685కు చేరింది. ఏప్రిల్ 16న 700కు చేరగా.. ఏప్రిల్ 17న ఈ సంఖ్య 964కు చేరుకుంది. ఏప్రిల్ 18న 1000ని దాటి 1,188కి చేరగా.. మరుసటి రోజు ఇది 1,274కు చేరింది. ఏప్రిల్ 20న హోం ఐసొలేషన్‌లోని కరోనా బాధితుల సంఖ్య 1,574కు చేరగా.. మరుసటి రేటు 2,000 ఎగువునకు చేరింది.

గత 15 రోజుల వ్యవధిలో ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఏప్రిల్ 11న 17 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరగా.. ఏప్రిల్ 24న 80 మంది కరోనా బాధితులు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. కరోనా కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

అటు ఢిల్లీలో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య గత 15 రోజులుగా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 11న 601 యాక్టివ్ కేసులు ఉండగా.. ఏప్రిల్ 24న ఈ సంఖ్య 3,975కు చేరింది.

అయితే కరోనా బాధితుల్లో ఎక్కువ మందు హోం ఐసొలేషన్‌లోనే ఉండి రికవరీ అవుతున్నారు. యాక్టివ్ కేసుల్లో మూడు శాతం కంటే తక్కువ మంది కరోనా బాధితులు మాత్రమే చికిత్స కోసం ఆస్పత్రులో చేరుతున్నారు.

అలాగే ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్స్ సంఖ్య పెరగకపోవడం కూడా ఊరట కలిగిస్తోంది. ఏప్రిల్ 11న 741 కంటైన్మెంట్ జోన్స్ ఉండగా.. ఇది ఏప్రిల్ 24నాటికి 656కు తగ్గింది.

Also Read..

Black Horse: లక్షలు పోసి మేలు జాతి నల్ల గుర్రాన్ని కొన్నాడు.. తీరా ఇంటికొచ్చాక మైండ్ బ్లాంక్..

Viral: దంపతులు ప్రయాణిస్తున్న కారులో రహస్య అరలు.. లోపల ఏముందో చూసి పోలీసులు షాక్