నచ్చినవారితో కలిసి ఉండటం తప్పేమీ కాదన్న అలహాబాద్‌ హైకోర్టు

|

Nov 03, 2020 | 11:30 AM

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.. మైనారిటీ తీరిన వారు తమకు నచ్చిన వారితో కలిసి ఉండవచ్చని కోర్టు స్పష్టం చేసింది.. కోర్టు ఈ తీర్పునివ్వడానికి కారణమైన వారు పూజా అలియాస్‌ జోయా, షావెజ్‌..

నచ్చినవారితో కలిసి ఉండటం తప్పేమీ కాదన్న  అలహాబాద్‌ హైకోర్టు
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.. మైనారిటీ తీరిన వారు తమకు నచ్చిన వారితో కలిసి ఉండవచ్చని కోర్టు స్పష్టం చేసింది.. కోర్టు ఈ తీర్పునివ్వడానికి కారణమైన వారు పూజా అలియాస్‌ జోయా, షావెజ్‌.. ఉత్తరపప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన వీరిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇంట్లోవారు అభ్యంతరం చెప్పడంతో పారిపోయి వివాహం చేసుకున్నారు.. అయితే ఈ కొత్త దంపతులు ఎక్కడున్నారో తెలుసుకున్న పూజా కుటుంబ సభ్యులు ఇద్దరిని పట్టుకొచ్చి ఇంట్లో బంధించారు.. ఏం చేయాలో పాలుపోక వారు తెలిసినవారి ద్వారా కోర్టును ఆశ్రయించారు.. తామిద్దరం మేజర్లమేనని, కలిసి జీవించే అవకాశం తమకు కల్పించాలని వేడుకున్నారు.. పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వారిద్దరిని కోర్టులో హాజరుపర్చాలంటూ పోలీసులను ఆదేశించారు. పోలీసులు వారిని కోర్టుకు తీసుకొచ్చారు.. తాను భర్తతోనే కలిసి ఉంటానంటూ న్యాయమూర్తికి విన్నవించుకుంది పూజ.. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు.. ప్రత్యేక వివాహచట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు పెళ్లి చేసుకోవచ్చని చెబుతూనే… వారి జీవితాలలో కల్పించుకునే హక్కు ఎవరికీ లేదని జడ్జ్‌ తీర్పును ప్రకటించారు.