కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ ‘పోరుబాట’……..24 న సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ….

| Edited By: Phani CH

Jun 21, 2021 | 9:11 PM

దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు....కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహాన్ని రూపొందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 24 న ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట........24 న సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ....
Sonia Gandhi
Follow us on

దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు….కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహాన్ని రూపొందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 24 న ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ శాఖల ఇన్-చార్జులు ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు. వర్చ్యువల్ గా జరిగే ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపైనా…కోవిద్ అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నేతలు తమతమ సూచనలను, సలహాలను ఇవ్వనున్నట్టు తెలిసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల, మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంతో బాటు కోవిద్ పరిస్థితిని ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్న వైనంకూడా ఈ మీటింగ్ లో చర్చకు రావచ్చు. క్షీణిస్తున్న దేశ ఎకానమీ, ప్రజలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళను నేతలు ప్రస్తావిస్తారని అంటున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సైతం కొందరు సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను వివరించే ప్రయత్నం చేయవచ్చు.

ఇప్పటికే కపిల్ సిబల్, జైరాం రమేష్ వంటి సీనియర్ నేతలు పార్టీ తీరుపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి వారి అభిప్రాయాలను ఈ సమావేశం పరిగణనలోకి తీసుకుంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా ఎన్సీపీ నేత శరద్ పవార్ అధ్యక్షతన మంగళవారం జరిగే విపక్ష పార్టీల సమావేశ పర్యవసాన్ని కాంగ్రెస్ నేతలు మదింపు చేయవచ్చునని భావిస్తున్నారు జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్ హైకమాండ్ ఈ మీటింగ్ నిర్వహించడం విశేషం. కాగా వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ ఓటమిపై మాత్రం సమగ్రమైన సమీక్ష జరగడంలేదన్నది వాస్తవమని అంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: దళితుల వ్యతిరేకి బీహార్ సీఎం నితీష్ కుమార్…..చిరాగ్ పాశ్వాన్ ఫైర్….అసలు స్వరూపం బయటపెడతానని వార్నింగ్

Skin Care : మోచేతులు, మోకాళ్ల దగ్గర నల్లగా ఉందా..! అయితే ఈ 6 మార్గాల ద్వారా వదిలించుకోండి..