తన కుటుంబంతో కలిసి ఈద్ జరుపుకునేందుకు జమ్మూ కాశ్మీర్ కి వెళ్లిన షకీర్ మంజూర్ అనే సైనికుడి జాడ కనబడడంలేదు. అతడిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి ఉండవచ్చునని భావిస్తున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి షకీర్ కనబడకుండా పోయాడని, షోపియన్ కు వెళ్లిన ఇతని కారు…. కుల్గాం జిల్లా సరిహద్దుల్లో సగం కాలిన స్థితిలో కనిపించిందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. 162 బెటాలియన్ కి చెందిన షకీర్ కోసం జవాన్లు గాలింపు చేపట్టారు. డ్యూటీలో లేని సైనికులు జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు వచ్చినా వారిని ఉగ్రవాదులు టార్గెట్ చేస్తుంటారని తెలుస్తోంది. కాగా-షకీర్ కిడ్నాప్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.