స్వాతంత్య్ర వచ్చిన 100 ఏళ్లు అనగా.. 2047 కల్లా.. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ‘వికసిత్ భారత్ 2047’పేరుతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతను భాగస్వామ్యం చేస్తున్న కేంద్రం.. ఇందులో భాగంగానే ‘వికసిత్ భారత్ అంబాసిడర్స్’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.
ఈ నేపధ్యంలోనే ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో ‘వికసిత్ భారత్ అంబాసిడర్స్’ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. మార్చి 7వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 7 వేల మంది మహిళలు హాజరయ్యారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో మహిళా విద్యార్ధులు దేశంలో ఎలాంటి మార్పును కోరుకుంటున్నారన్నది స్పష్టం చేయడంతో పాటు.. తాము యూనివర్సిటీలలో పడుతున్న ఇబ్బందులను కూడా తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ మహిళా విద్యార్ధి తమకు మరిన్ని హాస్టల్‌లు ఏర్పాటు చేయాలని స్మృతి ఇరానీని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి.. సత్వరమే మరో కొత్త హాస్టల్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినట్టుగానే వారంలోగా కొత్త హాస్టల్‌ను ఏర్పాటు చేశారు.
‘ఎప్పుడైతే దేశంలో మార్పు కోరుకోవాలని ప్రజలు అనుకుంటారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం సత్వరమే పరిష్కారంతో ముందుకొస్తుంది. వికసిత్ భారత్ అంబాసిడర్ – ఇది ఒక ఎమోషన్ మాత్రమే కాదు.. ఇది సత్వరమే ప్రభుత్వం తీసుకునే చర్య. ప్రజాస్వామ్యానికి భరోసా ఇచ్చే మార్పు రాయబారులు!’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు స్మృతి ఇరానీ.
When you become a champion of change and the government steps up with a solution you seek… Viksit Bharat Ambassador— it’s not just an emotion , it is action on ground . Ambassadors of change that assure democracy delivers !
Join the Movement Now ! pic.twitter.com/NPsvevA8MQ
— Smriti Z Irani (Modi Ka Parivar) (@smritiirani) March 15, 2024