ఇదేక్కడి దారుణం..? వైద్య పరికరాల కొరత.. ఆసుపత్రిలో యూరిన్ బ్యాగ్ స్థానంలో స్ప్రైట్ బాటిల్‌..

|

Aug 09, 2023 | 1:33 PM

వైద్య పరికరాల కొరత రోగుల పాలిట మృత్యుపాశంగా మారుతుంది. సర్కారీ దవాఖానాలో సదుపాయాల లేమి ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. ఆస్పత్రిలో యూరిన్ బ్యాగ్ బదులు స్ప్రైట్ బాటిల్ ఏర్పాటు చేసిన దృశ్యం..సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది. అవసరమైన పరికరాలు, మందులు లేకపోవడంతో ఓ ఆసుపత్రి సిబ్బంది యూరిన్ బ్యాగ్‌కు బదులుగా స్ప్రైట్ బాటిల్‌ను అమర్చిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇదేక్కడి దారుణం..?  వైద్య పరికరాల కొరత.. ఆసుపత్రిలో యూరిన్ బ్యాగ్ స్థానంలో స్ప్రైట్ బాటిల్‌..
Hospital Negligence
Follow us on

అవసరమైన పరికరాలు, మందులు లేకపోవడంతో ఓ ఆసుపత్రి సిబ్బంది యూరిన్ బ్యాగ్‌కు బదులుగా స్ప్రైట్ బాటిల్‌ను అమర్చిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బీహార్‌లోని ఓ ఆస్పత్రిలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ప్రాణాలను రక్షించే మందులు, వైద్య పరికరాలు లేకపోవడంతో బీహార్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది ఇన్‌పేషెంట్‌కు యూరిన్ బ్యాగ్ పెట్టడానికి బదులుగా స్ప్రైట్ బాటిల్‌ను ఉపయోగించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా, అపస్మారక స్థితిలో ఉన్న రోగిని జమున జిల్లా ఆసుపత్రికి తరలించారు. రోగిని పరీక్షించిన వైద్యుడు రోగికి యూరిన్ బ్యాగ్ బిగించాలని నర్సుకు సూచించారు. ఇన్సులిన్ ఇంజక్షన్ ఇచ్చి గ్యాస్ పైప్ తగిలించి స్పృహలోకి వచ్చేలా ప్రయత్నించాడు. అయితే ఆసుపత్రిలో అవసరమైన పరికరాలు, మందులు లేకపోవడంతో పేషెంట్ కు యూరిన్ బ్యాగ్ ఏర్పాటుకు బదులుగా.. స్ప్రైట్ బాటిల్ తగిలించి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పేషెంట్ కుటుంబీకులు ఆసుపత్రి మేనేజర్ రమేష్ పాండేని సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు మంగళవారం ఉదయం పరిస్థితిని వివరించి యూరిన్ బ్యాగులతో పాటు అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై సంబంధిత అధికారులను నిలదీయగా..యూరినల్ బ్యాగులు లేని విషయం నాకు తెలియదంటూ సమర్థించుకున్నారు మేనేజర్ రమేష్ పాండే. సమాచారం అందిన వెంటనే ఏర్పాట్లు చేశారు.

Hospital Negligence

ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి కాలు విరిగింది. అందుకే మందుల కొరత గురించి నాకు సమాచారం ఇవ్వలేదు’ అని సదరు అధికారు చెప్పడంతో ప్రస్తుతం అవసరమైన అన్ని మందులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చాలా రోజులుగా ఆస్పత్రిలో యూరిన్ బ్యాగుల కొరత ఉంది. అయితే యూరిన్ బ్యాగ్ కు బదులు సాఫ్ట్ డ్రింక్ బాటిల్ పెట్టడం సీరియస్ విషయం. విచారణ జరిపి సంబంధిత ఆరోగ్య కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని మేనేజర్ రమేష్ పాండే తెలిపారు.

ఇవి కూడా చదవండి

సోమవారం రాత్రి 60 ఏళ్ల వృద్ధుడు కాలు విరిగి రైల్వే ట్రాక్ దగ్గర పడి ఉన్నాడని జాజా రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు అతడిని ఆసుపత్రిలో చేర్చి తగు సమాచారం రాబట్టి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ఆసుపత్రిలో గందరగోళం నెలకొనడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి ఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలోని మెస్ కు యూరిన్ బ్యాగ్ కు బదులు శీతల పానీయం బాటిల్ తగిలించారని కూడా గుర్తు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…